15% సలార్ 2.. 35 % కల్కీ2.. 15% దేవర 2… పూనకాలు పెండింగ్..!

రెబల్ స్టార్ కల్కీ సీక్వెల్ కి ఇంకా ముహుర్తం అనుకోలేదన్న నిర్మాత మాటలు, మెల్లిగా వైరలయ్యాయి. కట్ చేస్తే తను చెప్పి 35 శాతం షూటింగ్ పూర్తవటం అన్న పాయింట్ మాత్రం రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. ఇదే కాదు రెబల్ స్టార్ సలార్ 2 తాలూకు షూటింగ్ కూడా సలార్ 1 తీస్తున్నప్పుడే పది శాతం పూర్తి చేసింది ఫిల్మ్ టీం.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 06:25 PM IST

రెబల్ స్టార్ కల్కీ సీక్వెల్ కి ఇంకా ముహుర్తం అనుకోలేదన్న నిర్మాత మాటలు, మెల్లిగా వైరలయ్యాయి. కట్ చేస్తే తను చెప్పి 35 శాతం షూటింగ్ పూర్తవటం అన్న పాయింట్ మాత్రం రెబల్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. ఇదే కాదు రెబల్ స్టార్ సలార్ 2 తాలూకు షూటింగ్ కూడా సలార్ 1 తీస్తున్నప్పుడే పది శాతం పూర్తి చేసింది ఫిల్మ్ టీం. అలాంటప్పుడు ఈ హిట్ మూవీల సీక్వెల్స్ త్వరగా తీస్తే, వేడిమీదున్నప్పుడు వసూల్ల దాడికి ఈజీ అవుతుంది. కాని అందుకు ముహుర్తం కావాలంటున్నారు. ప్రభాస్ ముందే కమిటైన ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి కావాలంటున్నారు. మరి స్పిరిట్ పరిస్థితేంటి? అది కూడా మొదలైతే, సలార్, కల్కీ సీక్వెల్స్ పరిస్థితేంటి? ఇంచుమించు ఇలాంటి సిచ్చువేషనే దేవర సీక్వెల్ కివచ్చింది. దేవర 2 సమ్మర్ లో మొదలౌతుందనుకుంటే, ఈలోపు డ్రాగన్, తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా…మరి దేవర 2 సెట్స్ పైకెళ్లేదెన్నడు..? ఆల్రెడీ 15 శాతం షూటింగ్ అయ్యాక కూడా ఎందుకు ఈ డిలే..?

రెబల్ స్టార్ సలార్ తో 750 కోట్లు రాబట్టిన వెంటనే, రెండు నెలల గ్యాప్ లో సలార్ 2 తీస్తారన్నారు. ఆల్రెడీ సలార్ 1 తీసేప్పుడే సీక్వెల్ తాలూకు మూవీ షూటింగ్ 15 శాతం పూర్తి చసింది ఫిల్మ్ టీం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు కల్కీ 2 షూటింగ్ ఏకంగా 35 శాతం పూర్తైందని తెలుస్తోంది. ఏకంగా నిర్మాతే ఈ స్టేట్ మెంట్ ఇవ్వటంతో ఇక కల్కీ 2 తీసేందుకు ఎందుకు లేటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి

సరే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ అవటంతో, కల్కీ 2 ని కాస్త నిదానంగానే ప్లాన్ చేయాలనకున్నారు. కాకపోతే తన డెలివరి, ఆతర్వాత రికవరి వీటికి టైం పడుతుందనుకుంటే, ఈలోపు తను లేని సీన్లు తీయొచ్చుకదా అన్న ప్రశ్నలు ఎదురౌతాయి. వాటన్నీంటికి ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తో బ్రేక్ వేశాడు ప్రభాస్

జనవరి 20లోగా ది రాజా సాబ్ షూటింగ్ పూర్తవుతుంది. ఫౌజీ సినిమామాత్రం జూన్ లేదంటే జులైలోనే పూర్తవుతుంది. ఇక మార్చ్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మొదలవ్వబోతోంది. అది పూర్తవ్వాలంటే కనీసం 5 నుంచి 8నెలలు టైం పట్టొచ్చు. టాకీ మాత్రం 5 నెలల్లో పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు సందీప్. అంటే 2026 జనవరిలోనే కల్కీ 2 కి మోక్షం ఉంటుందనుకోవాల్సి వస్తోంది. సలార్ 2 మొదలవ్వాలంటే ముందు ప్రభాస్ ఫ్రీ అవ్వాలి… అదిప్పట్లో కాదు కాబట్టి, ఈలోపు ఎన్టీఆర్ తో డ్రాగన్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్..

దీంతో దేవర 2 షూటింగ్ డైలామాలో పడుతోంది. దేవర2 ఈపాటికే 15 శాతం నుంచి 20 శాతం వరకు మొదటి భాగం తీసేప్పుడే తీశారు. పెండింగ్ 80శాతం షూటింగ్ కి 5 నెల్ల టైం చాలంటున్నాడట కొరటాల శివ. కాని వార్2, తర్వాత ధూమ్ 4, ఆతర్వాత సిద్దార్ధ్ ఆనంద్ మూవీ, ఈలోపు చేయాల్సిన డ్రాగన్ సినిమా ఇవన్నీ పూర్తికాకుండా దేవర 2 అంటే కష్టమే. కాకపోతే, ఒక్కో సినిమా షూటింగ్ కి మధ్యలో ఉండే గ్యాప్ లో దేవర 2 షూటింగ్ కి వీలౌతుందేమో చూడమని ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చాడట . కాని అదెంతవరకు సాధ్యంమో కొరటాల శివ తేల్చుకోలేకపోతున్నాడు. ప్లానింగ్ లో బిజీ అయ్యాడని మాత్రం ప్రచారం జరుగుతోంది.