దేవర” ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సోలో సినిమా. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు వచ్చిన ఇమేజ్ కు, రెండేళ్ళ నుంచి ఈ సినిమాపై వస్తున్న వార్తలకు సినిమాపై ఓ రేంజ్ లో హైప్ ఉంటుంది. అంచనాలు చాలా భారీగా ఉంటాయి. సినిమాపై ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకుడు కూడా సినిమాపై భారీగా ఆశలుపెట్టుకుంటాడు. చిన్న చిన్న హీరోల సినిమాలకే ఈ మధ్య కాలంలో అంచనాలు భారీగా ఉన్న సమయంలో ఈ సినిమాపై అంచనాలు ఉండటంలో ఏ మాత్రం తప్పు లేదు. కాని సినిమా విడుదలైన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
ముందు నుంచి నెగటివ్ ప్రచారం చేస్తున్న వాళ్లకు ఈ సినిమా పబ్లిక్ టాక్ బాగా ఊపు ఇచ్చింది అనే చెప్పాలి. ఎన్నడు లేని విధంగా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీగా జరిగింది. సినిమా కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూసారు. హిందీలో కూడా ఈ సినిమా కోసం జనాలు గట్టిగానే ఎదురు చూసారు అనే చెప్పాలి. కాని నెగటివ్ టాక్ తో కాస్త డీలా పడింది సినిమా. కాని సినిమాను చూస్తున్న కొందరు మాత్రం సినిమా బాగుంది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్షన్ మైనస్ అయినా ఎన్టీఆర్, అనిరుద్ సినిమాను ముందుకు నడిపించారు.
కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు పూనకాలు తెప్పించాయి. అయితే ఇక్కడ దేవర యూనిట్ కు ఒక శుభవార్త ఏంటీ అంటే… తెలుగులో ఎంత నెగటివ్ టాక్ వచ్చినా హిందీలో మాత్రం సినిమా శుక్రవారం సాయంత్రం నుంచి బాగా పుంజుకుంది అనే మాట వాస్తవం. మొదటి రోజు తెలుగులో తక్కువ వసూళ్లు ఏం రాలేదు. ఇక హిందీలో 8 కోట్లు వసూలు చేసింది. తెలుగుతో పోలిస్తే హిందీలో చేసిన ప్రమోషన్ చాలా తక్కువ. అయినా సరే అక్కడ శుక్రవారం సాయంత్రం నుంచి భారీగా టికెట్ లు బుక్ చేసారు. ఇక తమిళంలో కూడా సినిమాపై మంచి రివ్యూస్ వచ్చాయి. దీనితో హిందీలో వంద కోట్ల వసూళ్లు పక్కా అంటున్నారు ఫ్యాన్స్. సోమవారం సాయంత్రానికి ఓ అంచనా వస్తుందని భావిస్తున్నారు.