దేవరకు సూపర్ స్టార్ టార్గెట్, వచ్చే ఆదివారంతో జాతర ముగుస్తుందా…?

ఇప్పట్లో విడుదలయ్యే సినిమా లేదు. ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా లేదు. దేవర జాతరను ఆపే దమ్మున్న సినిమా విడుదల కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. డిసెంబర్ వరకు ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే సీన్ కనపడటం లేదు.

  • Written By:
  • Publish Date - October 7, 2024 / 02:01 PM IST

ఇప్పట్లో విడుదలయ్యే సినిమా లేదు. ఒక్కటంటే ఒక్క స్టార్ హీరో సినిమా లేదు. దేవర జాతరను ఆపే దమ్మున్న సినిమా విడుదల కావడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో తెలీదు. డిసెంబర్ వరకు ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే సీన్ కనపడటం లేదు. అందుకే దేవర ఇప్పుడు వసూళ్ళలో సునామీ సృష్టిస్తోంది. గతంలో ఏ సినిమాకు లేని క్రేజ్ తెలుగులో దేవరకు వచ్చింది. ఇంకా థియేటర్లలో దేవర మేనియా పోవడం లేదు. సినిమా తీసేయడానికి కూడా ప్రేక్షకులు భారీగానే వస్తున్నారు. వసూళ్లు ఇప్పటికే 500 కోట్లు దాటాయి.

దసరా వరకు అయితే తిరుగు లేదు అనుకున్నారు. దసరా సెలవలు కూడా దేవరకు బాగా కలిసి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో స్పీడ్ అయితే ఇంకా తగ్గలేదు. వసూళ్ళ సునామీని ఆపడానికి నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో ప్రచారం చేసి పెంచినా దేవర దూకుడు మాత్రం అసలు ఆగడం లేదు. అయితే ఇప్పుడు దేవర ముందు ఓ ముప్పు కనపడుతోంది. అదే రజనీ కాంత్ వేట్టాయన్ సినిమా. ఇది వచ్చే దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే దేవర మేనియా వచ్చే ఆదివారం వరకే అనేది ఫ్యాన్స్ భయం.

ఇప్పటికే కల్కీ రికార్డులను గురిపెట్టుకుని కొడుతున్న దేవరకు సూపర్ స్టార్ రజనీ కాంత్ రూపంలో ముప్పు పొంచి ఉంది. ఆ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్ అని గనుక ప్రచారం జరిగినా జనాలకు దేవర కంటే ఏ మాత్రం కొంచెం బెటర్ అనిపించినా కచ్చితంగా సినిమా ప్రభావం దేవర పై పడుతుంది అనడంలో సందేహం అయితే లేదు. ఇక దేవరకు ఇప్పటికే హింధీలో మంచి మార్కెట్ క్రియేట్ కాగా కన్నడలో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక తమిళంలో కూడా ఇప్పుడు దేవరకు తిరుగు లేదు అని ప్రూవ్ అవుతోంది.

అసలు దేవరకు కలిసి వచ్చిన అంశం ఏ భాషలో కూడా సినిమాల విడుదల ఇప్పట్లో లేకపోవడమే. రజనీ కాంత్ సినిమా వేట్టయన్ కు ప్రమోషన్స్ పెద్దగా జరగడం లేదు. రజనీ కాంత్ అనారోగ్యం కారణంగా అని తమిళ సినిమా వాళ్ళు అంటున్నా… సినిమాలో పెద్దగా స్టఫ్ లేదని అందుకే లైట్ తీసుకున్నారు అని మరికొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా వేట్టయన్ టాక్ పైనే దేవర సునామి కొనసాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది. వచ్చే ఆదివారానికి గాని దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు మరి.