దేవర మీద బురద చల్లే ప్రయత్నాలతో నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చినా, మ్యాన్ ఆఫ్ మాసెస్ కి మాత్రం మంచే జరుగుతోంది. దేవరక రెండో పాట కాపీ అంటూ మొన్నటి వరకు కామెంట్లు, ట్రోలింగ్స్ పెంచారు. వాటి వల్లే ఇంకా ఈ సినిమాకు, ఆ పాటకు మంచి ప్రమోషన్ దక్కింది. వచ్చీ రాగానే నలబై మిలియన్ల వ్యూస్, ఇప్పుడు ఏకంగా 75 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది చుట్టమల్లే సాంగ్
ఈ రెండు రోజుల్లో మరో పాతిక వేల వ్యూస్ తో యూ ట్యూబ్ లో వేగంగా పదికోట్ల వ్యూస్ సాధించిన పాటగా రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో యంగ్ టైగర్ ఇమేజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిపోయింది.
త్రిబుల్ ఆర్ తర్వాత చరణ్ కి ఆచార్య రూపంలో పంచ్ పడింది. ఎన్టీఆర్ మాత్రం రెండో పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఎలా చూసినా రాజమౌలి డైరెక్షన్ లో ఓ హీరోకి హిట్ పడ్డాక, ఏ మూవీ చేసినా ప్లాప్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ఉంది. ఆ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేయలేకపోయాడు. కాని ఎన్టీఆర్ కి మాత్రం సెంటిమెంట్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చేలా ఉంది
దేవర గ్లింప్స్ పేలింది. తర్వాత పియార్ సాంగ్ మీద కామెంట్ల దాడిజరిగింది. చుట్టమల్లే పాట మీద కూడా కామెంట్లు , ట్రోలింగ్ ఓ పధకం ప్రకారం జరిగినట్టే జరిగాయి. కాని వాటి వల్లే ఇంకా ఇంకా దేవర పాపులారిటీ పెరుగుతోంది. సో ఇదంతా చూస్తుంటే దేవరలో తారక్ వాడే ఆయుధానికి చేసిన ఆయుధ పూజ వర్కవుట్ అయినట్టుంది. యాంటీ ఫ్యాన్స్ ఎంత గింజుకున్నా సౌత్, నార్త్ అంతటా దేవర మీద అంచనాల భారం పెరగటానికి ట్రోలింగ్సే సాయపడుతున్నాయనే మాటే నిజమౌతోంది.