ఒక్క మాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు… దేవర ఇండియన్ బ్యాట్ మ్యాన్….

ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ప్రివ్యూ ఆల్రెడీ పడిపోయింది. కాని అందుకు 12 గంటల ముందు బాంబ్ పేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీకి అనిరుద్ పని చేశాడు.

  • Written By:
  • Updated On - September 26, 2024 / 07:36 PM IST

ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర ప్రివ్యూ ఆల్రెడీ పడిపోయింది. కాని అందుకు 12 గంటల ముందు బాంబ్ పేల్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీకి అనిరుద్ పని చేశాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ జవాన్ కి మ్యూజిక్ అందించాడు… కాని ఏనాడు కూడా ఆ సినిమాల రిలీజ్ కి ముందు ఎలాంటి కామెంట్ చేయలేదు. కాని దేవర విడుదలకు ముందు అనిరుద్ తోపాటు గ్నాన్ వేల్ ఇచ్చిన స్టేట్ మెంట్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ ల పూనకాలు వచ్చేస్తున్నాయి. త్రిబుల్ ఆర్ రిలీజ్ టైంలో కూడా ఇంత రచ్చ జరగలేదు…ఇంతకి అంతగా అనిరుద్ అన్న మాటేంటి? ఎందుకా స్టేట్ మెంట్ వైరలైంది?

దేవర సినిమా గురించి అనిరుద్ ఇచ్చిన ఒక్క స్టేట్ మెంట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి. ఎగ్జాక్ట్ గా దేవర ప్రివ్యూ రోజే అనిరుద్ ఇచ్చిన స్టేట్ మెంట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసేలా చేస్తోంది.. ఎన్నో పెద్ద సినిమాలకు, సూపర్ స్టార్ల మూవీలకు పనిచేసిన అనిరుధ్ ఎవరి మూవీకి ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు..

కాని తారక్ మూవీ చూసి ఓ మ్యూజిక్ డైరెక్టర్ గా తన మతే పోయిందన్నాడు. ఇంతవరకెన్నడూ చూడని యాక్షన్ పార్ట్ ని తను ఫస్ట్ టైం చూశాడట. ఫస్ట్ కాపీ చూసి దానికి మ్యూజిక్ కంపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇండియాలో కాదు, యూఎస్ లో బెస్ట్ రీ రికార్డింగ్ ఇవ్వాలని, మనసు పెట్టి మ్యూజిక్ చేశాడట

ఇంతగా ఓన్ చేసుకుని తను దేవరకు బీజీఎం కంపోజ్ చేయటానికి కారణం, గూస్ బంప్స్ వచ్చే భయనక సీన్లు… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఇలాంటి సీన్లు తాను చూడలేదన్నాడు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్లైన అవేంజర్స్ లాంటి మూవీలకు దేవర ఏమాత్రం తీసిపోదన్నాడు

ఇందులో అండర్ వాటర్ ఫైట్ సీన్ 45 నిమిషాలున్నా, అందులో 30 నిమిషాలు ప్రీ క్లైమాక్స్ గా వచ్చి, మిగతా 15 నిమిషాలు క్లైమాక్స్ లో వచ్చిందట.. ఈరెండు సెగ్మెంట్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయటానికి చాలా టైం తీసుకున్నా అన్నాడు అనిరుధ్. తను షారుఖ్ జవాన్ కి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాబోతున్న రజినీ మూవీ వెట్టయాన్ కి ఇలాంటి స్టెట్మెంట్ ఇవ్వలేదు.

కాని దేవర మీద అనిరుద్దే కాదు సినిమాటోగ్రాఫిర్ రత్న వేల్ కూడా 30 రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్నాడు. అంత కష్టపడి అండవర్ వాటర్ ఫైట్ సీన్లు తీశామన్నాడు. ఇవన్నీ కేవలం ప్రమోసన్ కోసం అనే మాటలైతే కాదు. ఎంతో లోతుగా వాళ్లకి కనెక్ట్ అయితే తప్ప ఇలాంటి స్టేట్మెంట్లు రావు.. మొత్తానికి తక్కువగా రియాక్ట్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఇచ్చిన స్టేట్మెంట్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేబులో చేతులు పెట్టుకుని ఆనందంతో ఎటో వెళ్లిపోయే పరిస్థితి వచ్చినట్టుంది.