టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి నడుస్తోంది. యువ హీరోలు పెళ్లి చేసుకుని కెరీర్ పై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల కిరణ్ అబ్బవరం వివాహం చేసుకోగా ఇప్పుడు… జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక అక్కినేని హీరో నాగ చైతన్య రెండో వివాహానికి రెడీ అయ్యాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నార్నేసి నితిన్ మొదటి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన మాడ్ అనే సినిమాతో హిట్ కొట్టాడు.
ఆ సినిమాలో ముగ్గురు హీరోలలో ఒకడిగా మెప్పించాడు ఎన్టీఆర్ బావమరిది. ఆ సినిమా తర్వాత వెంటనే మరో సినిమా చేసి హిట్ కొట్టాడు. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఆయ్ అనే సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. మరో సినిమా విడుదల కావాల్సి ఉన్నా అది వాయిదా పడుతోంది. నితిన్ నటించిన మొదటి సినిమా శ్రీశ్రీశ్రీ రాజా వారు దసరాకి రిలీజ్ అవుతుందని అందరూ ఎదురు చూసినా విడుదల కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఇక మూడు సినిమాలు చేసిన వెంటనే… పెళ్లి ఆలోచనతో స్టెప్ వేసాడు.
ఎవరికి తెలియకుండా ఆయన సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఈ హీరో. ఈ వేడుకకు ఎన్టీఆర్ కూడా హాజరు కావడం చూసి అందరూ షాక్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎంగేజ్మెంట్ కి హాజరైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వార్ 2 షూట్ లో ఉన్న ఎన్టీఆర్ దీపావళి కోసం హైదరాబాద్ వచ్చి… ఆ తర్వాత సైలెంట్ గా నిశ్చితార్దానికి వెళ్ళాడు. ఎన్టీఆర్ వెళ్ళకపోతే అసలు ఆ కార్యక్రమం గురించి మీడియా వర్గాల్లో గాని సినీ పరిశ్రమలో గాని ఎవరికీ అవగాహన లేదు. సైలెంట్ గా హిట్ కొట్టి పెళ్లి పీటలు ఎక్కేస్తున్నాడు ఈ హీరో. ఇక ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయి వివరాలు కూడా ఎవరికీ తెలియదు. ఇక బావమరిది ఎంగేజ్మెంట్ కోసమే ఎన్టీఆర్… వార్ 2 షూట్ ను వాయిదా వేసినట్టు టాక్. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే తిరిగి ముంబై వెళ్లి షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.