NTR 30: ఎన్టీఆర్‌ 30 నుంచి లీక్‌.. టైటిల్‌ ఇదేనా?

కొరటాల శివ తన సినిమాలకు చాలా పవర్‌ఫుల్‌గా ఉండే టైటిల్స్‌ పెడుతుంటాడు. దానికి తోడూ.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీస్తున్నది మాంచి యాక్షన్‌ ఫిలిం అని ఇప్పటికే చెప్పేశారు. దీంతో.. సినిమా టైటిల్‌ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 07:43 PM IST

సినిమాల గురించి సీక్రెట్స్‌ను ఎక్కువ కాలం దాచిపెట్టలేం. అది అంత ఈజీ మేటర్‌ కాదు. ఎందుకంటే ఓ సినిమా తీస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్‌ కోసం చాలా మంది పని చేస్తుంటారు. కాబట్టి ఎవరో ఒకరి దగ్గరి నుంచి ఏదో ఒక లీక్‌ బయటికి వస్తూనే ఉంటుంది. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్‌ ఇవ్వాలని.. హీరోలు, దర్శకులు దాచిపెట్టిన విషయాలను ఎవరో ఒకరు లీక్‌ చేస్తూ స్పాయిలర్స్‌ ఇస్తుంటారు.

ఇప్పుడు కొరటాల శివ(Koratala Shiva), ఎన్టీఆర్‌ (NTR) కాంబోలో వస్తున్న ఎన్టీఆర్‌30 నుంచి కూడా అలాంటిదే ఓ లీక్‌ వచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమాను అంతా ఎన్టీఆర్‌ 30 (NTR 30) అనే వర్కింగ్‌ టైటిల్‌తో పిలుస్తున్నారు. సినిమాకు టైటిల్‌ ఇంకా అనౌన్స్‌ చేయలేదు. కానీ.. ఈ సినిమాకు ‘దేవర’ (Devara) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా కొరటాల శివ తన సినిమాలకు చాలా పవర్‌ఫుల్‌గా ఉండే టైటిల్స్‌ పెడుతుంటాడు. దానికి తోడూ.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో తీస్తున్నది మాంచి యాక్షన్‌ ఫిలిం (Action Film) అని ఇప్పటికే చెప్పేశారు. దీంతో.. సినిమా టైటిల్‌ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఈ టైటిల్‌ కేవలం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ మూవీ మేకర్స్‌కు ఈ టైటిల్‌ నచ్చితే.. దీన్నే అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌.. షూటింగ్‌ త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఆస్కార్‌ అవార్డ్‌ ప్రజెంటేషన్‌ కోసం ఎన్టీఆర్‌ (NTR) అమెరికా వెళ్లాడు. ఆ ఫంక్షన్‌ నుంచి తారక్‌ (Tarak) రాగానే సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే చాన్స్‌ ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేస్తూ.. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం సినిమా నుంచి వచ్చిన ఈ లీక్‌తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ కుషీ అవుతున్నారు. దేవర అనే టైటిల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉందంటున్నారు. అయితే ఇదే టైటిల్‌తో మూవీ ముందుకు వెళ్తుందా.. లేదా వేరే ఏదైనా టైటిల్‌ను ఫైనల్‌ చేస్తారా చూడాలి.