DEVARA: యంగ్ టైగర్ వేట.. మాస్‌ జాతరకు ఇంకా మిగిలింది 100 రోజులే.!

ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ దేవర. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌ కానున్నడంతో కౌంట్‌డౌన్ షూరూ చేసింది దేవర మూవీ టీం. యంగ్ టైగర్ దేవర మూవీ రిలీజ్‌కు ఇంకా 100 రోజులే ఉందని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం.

  • Written By:
  • Publish Date - December 27, 2023 / 06:53 PM IST

DEVARA: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంక ఆశగా చూస్తున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు దిమ్మతరిగే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్ట్ అండ్ పోస్టర్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడదే నెట్టింట తెగ వైరల్ అవుతూ.. దేవర సినిమాపై కౌంట్‌ డౌన్ మొదలయ్యేలా చేసింది. అవధులు లేని ఆనందం పొందే రోజు దగ్గరలోనే ఉందని వారిని సంతోష పడేలా చేస్తోంది. ఎస్..! ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ఫిల్మ్ దేవర.

RAVI TEJA: మాసోడి ఎంట్రీ.. హనుమాన్‌లో రవితేజ

2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్‌ కానున్నడంతో కౌంట్‌డౌన్ షూరూ చేసింది దేవర మూవీ టీం. యంగ్ టైగర్ దేవర మూవీ రిలీజ్‌కు ఇంకా 100 రోజులే ఉందని తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం. పోస్టర్ మాత్రేమ కాదు.. టైగర్ వేటను 100 రోజుల్లో పెద్ద స్క్రీన్లలో అత్యంత భారీ ప్రదర్శన చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ దేవర అఫీషియల్ ఎక్స్ పేజీలో మేకర్స్ ప్రకటించారు. దేవరను దర్శకుడు కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్‌లో, భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఇప్పటికే భారీ యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కించిన కొరటాల.. రీసెంట్‌గా గంగమ్మ జాతరకు సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరించారట. అయితే.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట ఎన్టీఆర్. అంతేకాదు.. కొరటాల శివ కొన్ని ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తున్నాడట. తారక్‌ కూడా అస్సలు కాంప్రమైజ్ అవకుండా చాలా కష్టపడుతున్నాడట.

తాజాగా ఈ సినిమా నుంచి టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చింది. ఇందుకు సంబంధించి మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఒక సాలిడ్ పోస్ట్ పెట్టాడు. ‘దేవర’ టీజ‌ర్ సూప‌ర్ వ‌చ్చింది. గూస్ బంప్స్ అంతే.. ఈ టీజర్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. అందరూ టైగ‌ర్‌ను అభినందించాల్సిందే అంటూ అనిరుధ్ రాసుకోచ్చాడు. మొత్తంగా.. దేవర చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఖచ్చితంగా ఈ సినిమా యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా ఉంటుందని అంటున్నారు.