కన్నడలో దేవర KCPD, కల్కీ రికార్డ్ కావేరిలో కలిపేసాడు…?

తెలుగోడు తెలుగులో రికార్డులు కొడితే ఏముంది... పక్క భాషలో కొట్టాలి. తెలుగు సినిమా దమ్ము ఏంటో పక్క రాష్ట్రాల్లో కూడా తెలియాలి. తెలుగోడి సినిమా విడుదల అవుతుందంటే పక్క భాషల్లో బాక్సాఫీస్ కూడా షేక్ అవ్వాలి. ఇప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకున్నాడు దేవర.

  • Written By:
  • Updated On - September 26, 2024 / 02:50 PM IST

తెలుగోడు తెలుగులో రికార్డులు కొడితే ఏముంది… పక్క భాషలో కొట్టాలి. తెలుగు సినిమా దమ్ము ఏంటో పక్క రాష్ట్రాల్లో కూడా తెలియాలి. తెలుగోడి సినిమా విడుదల అవుతుందంటే పక్క భాషల్లో బాక్సాఫీస్ కూడా షేక్ అవ్వాలి. ఇప్పుడు ఇదే టార్గెట్ పెట్టుకున్నాడు దేవర. దేశంతో, భాషతో సంబంధం లేకుండా తొక్కుకుంటూ పోతున్నాడు. జాతర సునామీ దెబ్బకు బాలీవుడ్, కోలివుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని వుడ్ లు షేక్ అవుతున్నాయి. హాలీవుడ్ లో కూడా దేవర సత్తా ఏంటో ప్రూవ్ అయింది. ముఖ్యంగా సౌత్ లో అన్ని భాషల్లో దేవర దమ్ము చూసి షాక్ అవుతున్నారు జనాలు.

ట్రోల్ చేసే వాడు చేస్తూనే ఉన్నాడు, టికెట్ కొనే వాడు కొంటునే ఉన్నాడు, దేవర జాతర కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాడు చూస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా కన్నడలో ఎన్నడూ లేని విధంగా దేవర తన దమ్ము ఏంటో చూపిస్తోంది. కల్కీ సినిమా రికార్డ్ ఎవడూ చెరిపే సాహసం చేయలేరు అనుకున్న సమయంలో దిగిన దేవర… కల్కీ రికార్డ్ ని కావేరిలో కలిపేసింది. అసలు ఏంటి ఆ రికార్డ్ అనేది చూద్దాం. కల్కీ సినిమా కన్నడలో అడ్వాన్స్ సేల్స్… అంటే ప్రీ బుకింగ్స్ లెక్క చూస్తే… 2 వేల 818 టికెట్ లు అమ్ముడు అయ్యాయి. మొత్తం 192 షోస్.

కల్కీ ప్రీ బుకింగ్స్ 5 లక్షల 84 వేల 110 రూపాయలు వసూలు చేసింది. మొత్తం ప్రీ బుకింగ్ కల్కీ సినిమాకు దేవర కన్నడ వెర్షన్ ప్రీ బుకింగ్స్ 3 వేల 67 టికెట్ లు బుక్ అయ్యాయి. మొత్తం 106 షోస్… షోస్ తక్కువ అయినా బుక్ అయిన టికెట్స్ ఎక్కువ. అంటే హౌస్ ఫుల్ అయ్యాయి దాదాపుగా. దేవర మొత్తం 6 లక్షల 12 వేల 790 రూపాయలు వసూలు చేసింది. రెండు రోజుల సమయం ఉండగానే. అంటే దేవర జాతర కన్నడలో ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా హిట్ టాక్ వస్తే వసూళ్లు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోండి.