ఆ విషయంలో దేశానికే ఒక్కడు… ఫస్ట్ ఇండియన్ మూవీ…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర హిస్టరీ క్రియేట్ చేసింది. థియేటర్స్ ని మించేలా ఓటీటీలో పెను సంచలనంగా మారేలా ఉంది. మొన్నటి వరకు దేవర తెలుగు,తమిల్, మలయాళం, కన్నడ భాషల్లోనే అందుబాటులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 04:10 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర హిస్టరీ క్రియేట్ చేసింది. థియేటర్స్ ని మించేలా ఓటీటీలో పెను సంచలనంగా మారేలా ఉంది. మొన్నటి వరకు దేవర తెలుగు,తమిల్, మలయాళం, కన్నడ భాషల్లోనే అందుబాటులోకి వచ్చింది. కాని ఇప్పుడు హిందీ తో పాటు ఇంగ్లీష్ లోకూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఐతే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కొరియన్ భాషలోకి తర్చుమా అయిన సినిమాగా ట్రెండ్ సెట్ చేయటమే కాదు, బ్రెజీల్ లో కూడా దేవర దరువులు, ఓటీటీ ని షేక్ చేసేలా ఉంది. అక్కడితోనే కథ పూర్తి కాలేదు. దేవరని స్పానిష్ భాషలో కి కూడా డబ్ చేశారు. అంటే స్పేయిన్, మెక్సికన్ లు కూడా దేవర చూసేందుకు వీలుకాబోతోంది. ఒక ఇండియన్ మూవీ, అందులోనూ తెలుగు సినిమా, ఇంగ్లీష్, కొరియాలో డబ్ అవటమే గొప్ప విషయం అంటే, కొరియన్, స్పానిష్, బ్రెజీలియన్ లో డబ్ అవటం రికార్డే.. ఆ భాషల్లో స్పెసిఫిగ్గా ఎన్టీఆర్ మూవీని డబ్ చేయటానికి కారనం ఏంటి? ఓటీటీలో అసలేం జరుగుతోంది దేవర..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సౌత్ వర్షన్ ఓటీటీని దున్నేస్తుంటే, ఇప్పుడు హిందీ వర్షన్ లైన్ లో ఉంది. అయితే ఈ సారి సర్ ప్రైజింగ్ గా, దేవర మూవీని హిందీలోనే కాదు, ఇంగ్లీష్, స్పానిష్, కొరియా, బ్రెజిల్ తోపాటు పోర్చుగీసు భాషల్లో కూడా చూసేందుకు వీలు కలిపించింది నెట్ ఫ్లిక్స్ …

ఇదే ఇప్పుడు అందర్ని షాక్ కి గురిచేస్తోంది. ఇండియన్ మూవీసే కాదు, ప్రపంచంలో ఏసినిమా అయినా, కొరియా, స్పానిష్, పోర్చుగీస్, బ్రేజిల్ లాంటి భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చిందంటే అది విచిత్రమే.. ఎంతో గొప్ప సినిమాలు, వెబ్ సీరీస్ లను మాత్రమే ఇలా ప్రపంచ భాషల్లో డబ్ చేస్తారు

అదే ఇప్పుడు జరిగింది. బేసిగ్గా ఇండియన్ మాస్ మూవీ ఇంగ్లీష్ లో అందుబాటులోకి రావటమే హిస్టరీ, అలాంటిది స్పానిష్, పోర్చుగీసు, కొరియాలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చిందంటే, కారనం, మన సినిమాలు ముఖ్యంగా ఎన్టీఆర్ కి అక్కడ కూడా మార్కెంట్ ఉందని ప్రూవ్ అయినట్ట

ఈ మాటే నిజమనుకోవటానికి కారనం నాటు నాటు పాటే. నాటు నాటు పాట వళ్ల ఈ ఇద్దరు హీరోలుపేరుప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. త్రిబుల్ ఆర్ తో చరణ్ తో పోలిస్తే, మరింత గుర్తింపు ఎన్టీఆర్ కి దక్కింది. అదే కారణంతో నెట్ ఫ్లిక్స్ ఎన్టీఆర్ మూవీని క్యాష్ చేసుకునేందుకు, తన క్రేజ్ ని ఇలా విదేశి భాషల్లో వాడుకుంటోంది

దీని వల్ల ఎన్టీఆర్ కి బ్రేజిల్, కొరియా, స్పేయిన్, మెక్సికోలో మార్కెట్ పెరగొచ్చు..అదే జరిగితే, ఫ్యూచర్ లో తన కొత్త సినిమాల ఓటీటీ రీచ్ పెరిగి, ఓటీటీ రైట్స్ రేటు కూడా మరింత ఘాటెక్కొచ్చు.. మొత్తానికి కొరియా, స్పేయిన్, పోర్చుగీసు లో ఫస్ట్ టైం సౌండ్ చేసిన ఇండియన్ సినిమాగా దేవర హిస్టరీ సొంతం చేసుకుంటోంది. రిలీజ్ కిముందు, రిలీజయ్యాక ఎంత ట్రోలింగ్ చేస్తే, అంతకుమించి వసూళ్లు, ఓటీటీలో వ్యూస్ సాధించిన ఈసినిమా, ఇప్పుడు అంతకుమించిన చరిత్ర స్రుష్టిస్తోంది.