నయా రికార్డ్…నార్త్ ఇండియాలో యాసిడ్ టెస్ట్ పాస్…

పాన్ ఇండియా హిట్ రావాలంటే, తెలుగు సినిమా అయినా, తమిళ్ మూవీ అయినా నార్త్ ఇండియాలో హైప్ క్రియేట్ చేయగలగాలి. అక్కడి జనాల్లో హీరోకి మార్కెట్ క్రియేట్ అవ్వాలి. ప్రభాస్ అలాంటి యాసిడ్ టెస్ట్ లో పాసవ్వటమే కాదు, పాన్ ఇండియా కింగ్ అయ్యాడు.

  • Written By:
  • Publish Date - September 26, 2024 / 08:32 PM IST

పాన్ ఇండియా హిట్ రావాలంటే, తెలుగు సినిమా అయినా, తమిళ్ మూవీ అయినా నార్త్ ఇండియాలో హైప్ క్రియేట్ చేయగలగాలి. అక్కడి జనాల్లో హీరోకి మార్కెట్ క్రియేట్ అవ్వాలి. ప్రభాస్ అలాంటి యాసిడ్ టెస్ట్ లో పాసవ్వటమే కాదు, పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. ఇప్పుడు అచ్చంగా అలాంటి యాసిడ్ టెస్ట్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫేస్ చేశాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, కేజీయఫ్ ఫేం యష్ తో పోలిస్తే, అందరి కంటే ముందు అతి భయంకరమైన యాసిడ్ టెస్ట్ కి ముందే అడుగేశాడు ఎన్టీఆర్. లక్కీగా ఏ తెలుగు సినిమాకు లేనంత గిరాఖీ, డిమాండ్, సౌండ్ నార్త్ లో దేవరకి పెరిగిపోయింది. ఉత్తర భారత దేశంలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ చూస్తే తెలుగు ఫ్యాన్స్ కంగారు పడాల్సిందే

నార్త్ ఇండియాలో తెలుగు సినిమా దుమ్ముదులిపిందంటే, అది పాన్ ఇండియా హిట్ అయినట్టే. 500 కోట్ల నుంచి 1000 కోట్ల వసూళ్లు రావాలంటే, సౌత్ సినిమా ఏదైనా నార్త్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయాలి. ఆ విషయంలో దేవర కిలోమీటరు ముందుకే దూసుకెళ్లినట్టుంది. ఈవిషయంలో ఎన్టీఆర్ కి నార్త్ ఇండియా లో రికార్డుల మోత మోగేలా ఉంది

ఓన్లీ నవీ ముంబైలోనే 37 థియేటర్స్ లో 200 షోలు వేస్తున్నారంటే, ఇక నార్త్ ఇండియా మొత్తంగా దేవరకి ఎన్ని స్క్రీన్లు ఇంకెన్ని షోలు పడతాయో చెప్పక్కర్లేదు. అక్కడ అసలు ఆరు షోల కల్చరే లేదు. ఎప్పుడో జమానాలోనే ఉండేది. మల్టీప్లెక్స్ లోకూడా 4 లేదంటే కష్టంగా 5 షోలు వేస్తారు.. కాని విచిత్రంగా తెలుగు రాష్ట్రాల్లో లానే నార్త్ ఇండియాలో దాదాపు 90 సింగిల్ స్క్రీన్స్ లో రోజుకి 6షోలు వేస్తున్నారట.

ఉత్తర ప్రదేష్, హర్యాణ తో పాటు విచిత్రంగా గుజరాత్ లో దేవరకి ఎక్కువ గిరాఖీ కనిపిస్తోంది. మరి ముంబై ప్రమోషన్ల పుణ్యమో, త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ కి ఏర్పడ్డ క్రేజో కాని, దేవరకి సౌత్ లో తెలుగు రాష్ట్రాల్లో ఏరేంజ్ లో క్రేజ్ ఉందో ఉత్తరభారత దేశంలో అంతే క్రేజ్, హైప్ క్రియేట్ అవుతోంది. కపిల్ శర్మా షో, కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్, ఆలియా ప్రమోషన్ ఇవన్నీ దేవరకి నార్త్ ఇండియాలో భారీ క్రేజ్ కి కారనమయ్యాయి

ఇక పాన్ ఇండియ హిట్ కొట్టిన ఏ హీరోకైనా, రెండో పాన్ ఇండియా హిట్ అనేది యాసిడ్ టెస్ట్ లాంటింది. బాహుబలి రెండు బాగాల తర్వాత సాహోతో అలాంటి యాసిడ్ టెస్ట్ పాసైన ప్రభాస్, తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ తో ఫేలయ్యాడు. సలార్, కల్కీ బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా యాసిడ్ టెస్ట్ లో డిస్టింక్షన్ లో పాసయ్యాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చింది. ఈవిషయంలో క్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కూడా ఉన్నారు.కాని వాళ్లకి ఇంకా డిసెంబర్ వరకు టైం ఉంది. ఈలోపే ఊపేసేందుకు దేవరగా వచ్చేశాడు ఎన్టీఆర్. లక్కీగా ప్రివ్యూ పేలిపోయింది. యూఎస్, ముంబై, హైద్రబాద్ రిపోర్ట్ తో పోలిస్తే, ఆస్ట్రేలియా నుంచి వస్తున్న టాకే ఇక్కడ రిపీట్ అవుతోంది. దేవర ఓ రెగ్యులర్ మాస్ మూవీలా కనిపించే అసాధరణ పాన్ ఇండియా మూవీగా మారిపోవటానికి కారణం లాస్ట్ 45 మినట్సే అంటున్నారు.

బాహుబలి 2 లో ఇంటర్వెల్ సీన్ లా, త్రిబుల్ ఆర్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ లా దేవరలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాహుబలినే మించాయి. ఇండియన్ సినిమాల్లోనే ఏ మూవీలో లేని స్థాయి గ్రాఫిక్స్ ని ఈ మూవీ క్లైమాక్స్ లో వాడటం చూసే అంతా పరేషాన్ అవుతున్నారు.నార్త్ ఇండియాకు ఓమాదిరి క్వాలిటీ గ్రాఫిక్స్ తో సినిమా తీస్తేనే షాకవుతారు..అలాంటిది అంతకుమించేలా విజువల్ ఎఫెక్ట్స్ కి ఎమోషనల్ యాక్షన్ డ్రామా తోడైతే ఆ కిక్కే వేరు… రిలీజ్ కిముందే 5 మిలియన్లు రాబట్టిన సినిమా, ప్రివ్యూతో కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రివ్యూకి రెస్పాన్స్ అదిరిపోతోంది.