దేవర బొమ్మ పడటానికి ఇంకా రెండు రోజులు కూడా లేదు. రేపు రాత్రి నుంచి షోస్ మొదలవుతాయి. రేపు రాత్రిలోపు ఏం జరుగుతాయో, ఏ రికార్డులు ఎర్ర సముద్రంలో కలుస్తాయో అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అమెరికాలో సైలెంట్ గా 2 మిలియన్లు క్రాస్ అయింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో రికార్డుల ఊచకోత నమోదు అవుతోంది. కర్ణటక, తమిళనాడు, హిందీలలో దేవర సునామీ వస్తోంది. విడుదలకు ముందే రికార్డులు ఎలా ఉంటాయో దేవర చూపిస్తోంది. సినిమా రిజల్ట్ పై క్లారిటీ లేకుండానే ఇదంతా.
దీనెమ్మ బొమ్మ సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వస్తే మాత్రం షేక్ అవ్వడమే. బాలీవుడ్ లెక్కలు కూడా ఒక్క దెబ్బకు షేక్ అవుతాయి. ఇక బాలీవుడ్ ని మర్చిపోవడమే, ఇండియన్ సినిమాలో బుడ్డోడి లెక్కలు కొత్త టార్గెట్ లు సెట్ చేస్తాయి. కల్కీ దెబ్బకు ఇప్పటికే బాలీవుడ్ షేక్ అవుతోంది. దేవర దెబ్బకు పునాదులు ఊగడం పక్కా. మీ లెక్కలు మీకుంటే నా విజన్ నాకుంది అంటూ దేవర రికార్డుల మోత మోగిస్తోంది. బుక్ మై షో సహా పలు బుకింగ్ యాప్స్ తమ సత్తా చాటుతున్నాయి. సినిమా బజ్ దెబ్బకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సైలెంట్ గా చూస్తున్నారు.
ఇక హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లెక్కలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సినిమా పండితుల అంచనాల ప్రకారం… ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 7 థియేటర్ లు ఉండగా… 46 షోస్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మొత్తం కోటి 25 లక్షల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఏ హీరోకి ఈ రేంజ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రాలేదనే చెప్పాలి. డే 1 లెక్క మాత్రమే ఇది. ఇక హిట్ టాక్ వస్తే తర్వాతి రోజుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ ఉంటాయో ఊహించుకోవచ్చు. బుకింగ్ యాప్స్ లో ఈ 7 థియేటర్లలో ఒక్క టికెట్ కూడా ఖాళీగా ఉన్నట్టు చూపించడం లేదు. హిట్ టాక్ వస్తే మాత్రం ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏ కాదు వరల్డ్ వైడ్ దేవర జాతర పీక్స్ లో ఉండటం పక్కా.