Devara : దేవర.. గుంటూరు కారం ను పక్కకు తోసి..

ఆర్ఆర్ఆర్‌ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఆయనకు వరస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ కోసం శ్రమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. పాన్ ఇండియన్ సినిమా దేవర గ్లింప్స్ నిన్న విడుదల చేశారు. ఈ వీడియోకి అందరి నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

దేవర గ్లింప్స్ 24 గంటల్లో 26.2M వీక్షణలను పొంది తెలుగులో మునుపటి టీజర్ రికార్డులను బద్దలు కొట్టింది. 21 మిలియన్ల వీక్షణలతో మహేష్ బాబు గుంటూరు కారం మొన్నటి వరకు టాప్‌లో ఉండగా, ఎన్టీఆర్ దేవర రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టింది. తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో కూడా గ్లింప్స్ ఆఫ్ దేవరకు మంచి స్పందన వచ్చింది. హిందీలో ఇది 24 గంటల్లో 18.5M వీక్షణలను నమోదు చేసింది. ఇది ఒక సంచలనాత్మక ఫీట్‌గా చెప్పొచ్చు. పాన్ ఇండియన్ విడుదలకు అద్భుతమైన పుష్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం తమిళ, మలయాళ గ్లింప్స్ దాదాపు 1.1 మిలియన్ల వీక్షణలను పొందాయి

ఓవరాల్‌గా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర నిర్మాతలు టీజర్ OSTని విడుదల చేశారు. దేవర రెండు భాగాల సినిమా అని అందరికీ తెలిసిందే. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు.