టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల హడావుడి పీక్స్ లో ఉంది. సినిమాల రిలీజ్ వరుసగా ఉండటంతో నిర్మాతలు కూడా చాలా స్ట్రాంగ్ గా వర్కౌట్ చేస్తున్నారు. ప్రమోషన్ ప్లాన్స్ కూడా పీక్స్ లో చేస్తున్నారు. దేవర సినిమా దెబ్బకు ట్రోలింగ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూసిన నిర్మాతలు… సినిమాను ఏ రేంజ్ లో టార్గెట్ చేసినా వర్త్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూసారు. అందుకే ఇప్పుడు స్టార్ నిర్మాతలు తమ ఫ్యూచర్ ను కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ సినిమాలను ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ లో రెండు స్టార్ హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకటి పుష్ప 2, రెండు గేమ్ చేంజర్. ఒకటి డిసెంబర్ లో రెండోది జనవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 విషయంలో నిర్మాతలకు భయం లేదు గాని గేమ్ చేంజర్ విషయంలోనే కాస్త భయాలు ఉన్నాయి. ఆ సినిమాను ఇప్పుడు ఎలా ట్రోల్ చేస్తారు, అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది అనే భయం ఎక్కువగా ఉంది. ఇక నార్త్, కన్నడ, తమిళ రైట్స్ ను ఏ రేంజ్ లో అమ్ముతారు, అక్కడ ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తారు అనే దానిపై ఫ్యాన్స్ లో కాస్త భయాలు ఉన్నాయి.
ఫైనల్ గా గేమ్ చేంజర్ నార్త్ రైట్స్ ను భారీగానే అమ్మేసారు. దేవర కంటే ఎక్కువగానే అమ్మినట్టు టాక్. ఈ మూవీని నార్త్‌లో అనిల్ తడాని AA ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. దాదాపుగా 35 కోట్లకు అమ్మినట్టు టాక్. దేవరను 15 కోట్లకు మాత్రమే అమ్మారని వార్తలు వచ్చాయి. ఇక సినిమా విడుదలకు ముందే దేవరను బీట్ చేయడం మెగా ఫ్యాన్స్ కు కాస్త జోష్ ఇస్తోంది. ఇటీవల విడుదలైన “జరగండి”, “రా రా మచ్చ” అనే రెండు ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్స్ కూడా ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. యూట్యూబ్ లో వాటికి మంచి వ్యూస్ వచ్చాయి.
గేమ్ ఛేంజర్”లో రామ్ చరణ్ నిజాయితీగా గల ఐఏఎస్ అధికారిగా, అణగారిన వర్గాల సంక్షేమం కోసం పోరాడే పొలిటికల్ లీడర్ రోల్స్ చేస్తున్నాడు. హైదరాబాద్, న్యూజిలాండ్, ఆంధ్రప్రదేశ్, ముంబై, చండీగఢ్ సహా అనేక ప్రాంతాల్లో సినిమాను షూట్ చేసారు. యాక్షన్ సీన్స్ లో కచ్చితంగా శంకర్ మార్క్ ఉంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసమే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను కూడా వాయిదా వేసుకున్నారు. జనవరి 10, 2025న సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.