దేవర సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు ఉంది సరిగా. ఈ వారం రోజుల్లో ఏ రికార్డులు బద్దలు అవుతాయో అనే ఉత్కంట నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినిమా జనాల్లో గట్టిగా ఉంది. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ఒక్కో వార్త ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇస్తోంది. ఈ సినిమాపై విదేశాల్లో హైప్ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్ విషయంలో అక్కడ క్రేజ్ పెరగడంతో జనాలు ఎగబడి టికెట్ లు కొంటున్నారు. అమెరికాలో ప్రీ రిలీజ్ కి ముందే రెండు మిలియన్లు వసూలు చేసిన సినిమాగా దేవర రికార్డు సృష్టించడం ఖాయంగా కనపడుతోంది.
ఇక యూకే సహా యూరప్ దేశాల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కడ కూడా ప్రీ రిలీజ్ భారీగా జరుగుతోంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆస్ట్రేలియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాల్లో దేవర సినిమాను టోలి ఫిలిమ్స్ విడుదల చేస్తుంది. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆస్ట్రేలియాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ లక్షా 50 వేల డాలర్లు దాటింది. మరిన్ని రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టే అవకాశం కనపడుతోంది. సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు ఉంటాయో చూడాలి.
విడుదలకు ఇంకా వారం రోజులు ఉండటంతో ఆస్ట్రేలియాలో కనీసం 3 లక్షలు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు ఇంకా భారీగా ఉండనున్నాయి. అమెరికా కెనడా దేశాల్లో చాలా థియేటర్ లు హౌస్ ఫుల్ అయిపోయాయి. వాకిన్స్ కి టికెట్ లు దొరకడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో కూడా అలాగే పరిస్థితి ఉందని టాక్ నడుస్తోంది. ఆస్ట్రేలియాలో తెలుగుతో పాటుగా హిందీలో కూడా భారీగా విడుదల చేస్తున్నారు. ఇక మన దేశంలో కూడా హిందీపై భారీగా ఫోకస్ పెట్టింది చిత్ర యూనిట్.