6 రోజుల్లో 400 కోట్లు… దేవర తుఫాన్ కాదు సునామీ…

దేవర సౌత్, నార్త్ అంతటా దుమ్ముదులుపుతున్నాడు.. ఎవరికీ అర్ధం కావట్లేదు.. అన్ని కామెంట్లు, ట్రోలింగ్స్ వచ్చినా, యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయినా, ఎక్కడా వసూళ్లకి బ్రేక్ పడట్లేదు. చూస్తుండగానే ఈ మూవీ 400 కోట్ల క్లబ్ లోచేరిపోయింది.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 09:20 AM IST

దేవర సౌత్, నార్త్ అంతటా దుమ్ముదులుపుతున్నాడు.. ఎవరికీ అర్ధం కావట్లేదు.. అన్ని కామెంట్లు, ట్రోలింగ్స్ వచ్చినా, యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోయినా, ఎక్కడా వసూళ్లకి బ్రేక్ పడట్లేదు. చూస్తుండగానే ఈ మూవీ 400 కోట్ల క్లబ్ లోచేరిపోయింది. అది కూడా కేవలం 6 రోజుల్లోనే.. ఇది అన్నీంటికి మించిన షాక్. ఎందుకంటే 350కోట్లు పెట్టుబడి వచ్చిన సినిమా బ్రేక్ ఈవెన్ లోకి రావటమే కాదు, 50 కోట్ల అదనపు ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. రోజుకి యావరేజ్ లో 70 కోట్ల చొప్పున 6 రోజుల్లో 400 కోట్లు రాబట్టిన ఈసినిమా, మరో 8 రోజుల్లో వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా ఉంది. మొన్నటి వరకు ఈ సినిమా వసూళ్లు చూసి ఇదో తుఫాన్ అనున్నారు. కాని సునామీ అనితేలింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, తెలుగు, హిందీ మార్కెట్లో దేవరకి అడ్డు అదుపు లేదు. తమిళ, మలయాళ వర్షన్స్ లో ఈ స్థాయి వసూల్లులేవు.. కాని అదేం విచిత్రమో అదే తమిళ, మలయాళ వర్షన్లు అమెరికాలో వసూళ్ల వరద పెంచాయి… ఇలాంటి చిత్ర విచిత్రాలే అర్ధం కాక, హిందీ, తమిళ మీడియాలో సినీ జనాలకు పిచ్చెక్కుతోంది.. ఇంతకి రీజనేంటి?

దేవర వసూళ్ల లెక్కలు వచ్చాయి. ఈ సినిమా 6 రోజులు వసూళ్లతో 400 కోట్ల క్లబ్ లో చేరింది. కల్కీతో పోలిస్తే ఈ మూవీనే వేగంగా ఈ ఫీట్ ని సొంతం చేసుకుంది. కల్కీ 7 రోజుల వసూళ్లు 400 కోట్లయితే, ఒకరోజు ముందే ఈ రికార్డుని క్రియేట్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఇక్కడ అన్నీంటికంటే మరో వింతేంటంటే, బాహుబలి 2 తో 1850 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన ప్రభాస్, మళ్లీ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టాలంటే, 5 సినిమాల వరకు వేయిట్ చేయాల్సి వచ్చింది. కాని త్రిబుల్ ఆర్ తో 1200 కోట్లు రుచి చూసిన ఎన్టీఆర్, ఆతర్వతీ సినిమాతోనే వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టేలా ఉన్నాడు.

నైజాంలో అయితే రోజుకి 3.7 1 కోట్ల షేర్, 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దేవర దుమ్ముదులుపుతుంటే, సీమాంధ్ర లో ఈ లెక్క 22 కోట్లను రీచ్ అయ్యింది. ఇక నార్త్ ఇండియాలో రోజుకి 20 కోట్లు యావరేజ్ గా వస్తుంటే, యూఎస్ లో ఈజీగా రోజుకి 8 కోట్లు అంటే ఒక మిలియన్ డాలర్స్ వసూళ్లొస్తున్నాయి.

కన్నడ, తమిళ, మలయాళ మార్కెట్స్ లో మిగతా వసూళ్లు మొత్తంగా రోజుకి 65 నుంచి 70 కోట్ల వరకు దేవర వసూళ్లవస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలుగు, హిందీ మార్కెట్ లో మాస్ మతిపోగొట్టిన దేవరకి, వసూళ్ల సునామి ఆగట్లేదు

ఇంతవరకుఓకే కాని, యూఎస్ వసూళ్లే ఎవరికీ అంతుచిక్కట్లేదు. అక్కడ, హిందీ, తెలుగు వర్షన్ కి వసూళ్ల వరద వచ్చినా రోజుకి వన్ మిలియన్ డాలర్స్ వచ్చేంత సీన్ లేదు. అక్కడ సెటిలైన తమిళ, మలయాళ, కన్నడ జనాలు కూడా దేవరని చూస్తేనే, ఇన్ని వసూళ్లు సాధ్యం. కాని కన్నడ, తమిళ, మలయాళ మార్కెట్లలో దేవర వసూళ్ల వరద తెలుగు, హిందీ తో పోల్చేంతగా లేదు. కాని యూఎస్, ఆస్ట్రేలియా, బ్రిటన్ లోని తమిళ,మలయాళ, కన్నడిగులు దేవరని తెగ చూస్తున్నారు..

దీన్ని బట్టి చూస్తే ఇండియాలోనే పొరుగింటి సినిమాను వ్యతిరేకించే వాళ్లు ఎక్కువున్నారనకుకోవాలా ఏమోకాని, దేవర మూవీ 6 రోజుల్లో 400 కోట్లు రాబడితే, మరో 400 కోట్లకు ఆరు రోజులు వేసుకున్నా మరో 8 రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లో దేవర అడుగుపెట్టడం ఖాయమైంది.

మరో ఎనిమిది రోజులంటే, దసరా రోజులేదంటే దసరా తర్వాత రోజు వచ్చే వసూళ్లతో దేవర మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. అదే జరిగితే, బాహుబలి 2, కల్కీ , త్రిబుల్ ఆర్ తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరిన నాలుగో తెలుగు సినిమా దేవరే అవుతుంది… దంగల్, పటాన్, జవాన్ తో కలిపి 1000 కోట్లు రాబట్టిన 8వ పాన్ ఇండియా మూవీగా దేవరకి హిస్టరీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.