దేవర 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టినట్టు ఫిల్మ్ టీం విచిత్రంగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వసూళ్లను తేల్చింది. నిజానికి దేవర విడుదలైన 6 రోజే 400 కోట్లు, 8 రోజు 680 కోట్లు రాబట్టిన ఈ సినిమా అసలు ఓపెనింగ్సే 172 కోట్లు తెచ్చుకుంది. ఎలా చూసినా దేవర వచ్చి 16 వ రోజులవుతున్నా, వసూళ్లు 500 కోట్లంటే నమ్మశక్యంగా లేదనే కామెంట్లు పెరిగాయి. ఆల్రెడీ 1000 కోట్లు రాబట్టిన దేవర వసూళ్లని సగమే ఎందుకుచూపిస్తున్నారు… ? ఈ ప్రశ్నకి ట్రెండ్ మార్చే సమాధానం ఎన్టీఆర్ దగ్గరుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, దేవర వచ్చాక ఒకలెక్క అన్న మాటే వినిపిస్తోంది. ఓ సినిమా వసూళ్లను లెక్కేసే విధానమే మార్చేస్తున్నారు. గ్రాస్ వసూళ్లకి ఎండ్ కార్డ్ పడుతోంది. దేవర లానే అంతా నిర్మాత చేతిలోకొచ్చే నెట్ షేర్ వసూళ్లే లెక్కేస్తే బాహుబలి 2 రాబ్టటిన 1850 కోట్లు కూడా తగ్గిపోతాయా? అంటే నిజంగానే బాహుబలి 2 నెట్ వసూళ్లు1000 కోట్లు దాటలేదా? ఈ డౌట్ల వెనకున్న కిటుకేందో చూసేయండి.
దేవర 8రోజుల్లో 466 కోట్లు, 16 రోజుల్లో 500 కోట్లు ఇవి గ్రాండ్ గా దేవర టీం ఎనౌన్స్ చేసిన లెక్కలు. కాని మొదటి రోజే 172 కోట్లు రాబట్టిన దేవర, 8 రోజుల్లో 466 కోట్లు రాబడితే, ఆతర్వాత 8 రోజులకు కూడా కేవలం 100 కోట్లు అదనంగా రాబడుతుందా? సౌత్ కంటే నార్త్ ఇండియాలో పూనకాలు వచ్చేలా జనాలు దేవరకి బారులు తీరితే, మరెందుకు దేవర నిర్మాతలు మరీ 500 కోట్ల వసూళ్లే లెక్కచూపిస్తున్నారు..
అక్కడే ట్రెండ్ సెట్ చేసే లాజిక్ ఉంది. ఆల్రెడీ గత కొన్ని వారాలుగా గ్రాస్ కలెక్షన్స్, నెట్ షేర్ కలెక్షన్స్ మీద చర్చ జరుగుతోంది. ఓ సినిమా రిలీజయ్యాక మొదటి రోజు నుంచి కలెక్ట్ అయ్యే ప్రతీ టిక్కెట్ ఎమౌంట్ ని కలిసి గ్రాస్ కలెక్షన్స్ అంటారు. కాని అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్, థియేటర్ ఓవనర్ షేర్ పోను నిర్మాతకి 30 నుంచి 40 శాతమే దక్కుతుంది..
అంటే 100 కోట్లు వచ్చిన మూవీలో నిర్మాతకి దక్కేది 30 నుంచి 40 కోట్లే… అలా లెక్కేసి దేవర 1000 కోట్లు రాబడితే, నిర్మాత ఎకౌంట్ లో పడ్డ 500 కోట్ల వరకే ఎనౌన్స్ చేస్తున్నారట. బేసిగ్గా ఎక్కడైనా వసూళ్లు తక్కువస్తే, ప్రెస్టీజ్ కోసం కొన్ని నెంబర్లు పెంచి ఎక్కువ ప్రచారం చేస్తారు. కాని దేవర సునామీ క్రియేట్ చేసినా నిర్మాతలు మాత్రం గ్రాస్ కలెక్షన్స్ కాకుండా, నెట్ షేర్ వసూళ్లే ఎనౌైన్స్ చేయటానికి కారణం, సరికొత్త రూట్లో వెళ్లటం
కళ్యాణ్ రామ్ నిర్మాత అయితే ఎన్టీఆర్ కి కూడా ఈ సినిమా బిజినెస్ లోషేర్ ఉంది. ఐతే, ఫేక్ కలెక్షన్స్, లేదంటే గంభీరంగా కనిపించే గ్రాస్ కలెక్షన్స్ కాకుండా, జెన్యూన్ గా నిర్మాత చేతికి అందే షేర్ కలెక్షన్సే ఎనౌన్స్ చేస్తే, ఇండస్ట్రీకి మంచదనే అభిప్రాయముంది.
1000 కోట్ల బిజినెస్ జరిగితే, అందులో చాలా మందికి పోను నిర్మాతకు వచ్చిది 450 నుంచి 500 కోట్లే ఆ విషయమే హానెస్ట్ గా చెబితే, ఈ గ్రాస్ కలెక్షన్ల గొడవుండదు.. నిజంగా నిర్మాత జేబులోకి ఎంతొచ్చిందో తేలిపోతుంది. అలాచూస్తే బాహుబలి 2 నుంచి కల్కీ వరకు త్రిబుల్ ఆర్ నుంచి కేజీయఫ్ం 2 వరకు గ్రాస్ కలెక్షన్స్ అదిరిపోవచ్చు.. కాని నిర్మాతకు అందిన షేర్ లెక్కలు చూస్తే ఏది కూడా వెయ్యికోట్లను దాటలేదట
బాహుబలి 2 టోటల్ గ్రాస్ కలెక్షన్స్ 1850 కాని, నిర్మాతకి అందే షేర్ కలెక్షన్స్ పరంగా చూస్తే వచ్చింది 970 కోట్లే, ఇక కల్కీ 1250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో నిర్మతల షేర్ 750 కోట్లే, పటాన్ షేర్ కలెక్షన్స్ 550 కోట్లు, ఇకత్రిబుల్ ఆర్ షేర్ కలెక్షన్స్ 690 కోట్లు, ఇక కేజీయఫ్ 2 కైతే 640కోట్ల షేర్ వసూళ్లే వచ్చాయి. ఇది నిర్మాత ఎకౌంట్ లో పడే డబ్బని తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్ల ఎనౌన్స్ మెంట్ ఆపి, షేర్ వసూళ్లే ఎనౌన్స్ చేయాలనే చర్చ ఇండస్ట్రీలోఎంతో కాలం నుంచి జరుగుతోందట. దాన్నే అమలు చేసి, 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఎనౌన్స్ చేయకుండా, 500 కోట్ల షేర్ కలెక్షన్స్ నే ఎనౌన్స్ చేస్తోంది దేవర టీం.