దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్ లో ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క. బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 సినిమాతో తన అడుగు ఓ రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేసి రంగంలోకి దిగుతున్నాడు. వార్ 2 విషయంలో ఏ మాత్రం తేడా జరగకుండా ప్లాన్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ విషయంలో సౌత్ మొత్తం తాను హ్యాండిల్ చేస్తా అని హామీ కూడా ఇచ్చేసాడు టీంకి. ఇప్పుడు వార్ 2 షూట్ లో ఎన్టీఆర్ పాల్గొనడానికి ముంబైలో ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే ఈ షూట్ మొదలుకానుంది.
చేజింగ్ సీన్స్ తో పాటుగా ఎన్టీఆర్ తో యాక్షన్ సీన్స్ ని కూడా షూట్ చేస్తారు. అలాగే ఒక పాట కూడా షూటింగ్ ఉంటుందని టాక్. దీనికి సంబంధించిన షెడ్యూల్ జనవరి వరకు ఉంటుందని త్వరలోనే ఎన్టీఆర్ తో ఓ హీరోయిన్ రోమాన్స్ చేసే సీన్స్ కూడా ప్లాన్ చేసారని టాక్ నడుస్తోంది. ఇక వార్ 2 లో హిందీ డైలాగ్ లు ఎన్టీఆర్ స్వయంగా చెప్తున్నాడు. దీనితో డబ్బింగ్ బాధ కూడా చిత్ర యూనిట్ కి లేదు. తెలుగులో ఎన్టీఆర్ ప్రమోషన్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇక తమిళం, కన్నడం డబ్బింగ్ కూడా ఎన్టీఆర్ స్వయంగా చెప్తాడని ప్రమోషన్స్ చేస్తాడని టాక్.
దీనితో ఎన్టీఆర్ కు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ టాలెంట్ కు ఫిదా అయిపోయాడు. ఎన్టీఆర్ కు సీన్స్ ఇప్పటికే వివరించాడని టాక్. ముంబైలో మిడ్ నైట్ షూట్ ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చిత్ర యూనిట్ కు ఒక రిక్వస్ట్ పెట్టాడట. తెలుగులో వార్ 2 టైటిల్ మార్చాలని అడిగాడట. పాన్ ఇండియా సినిమాలకు ఈ మధ్య కాలంలో ఒకటే టైటిల్ ఉంటుంది. కాని వార్ 2 విషయంలో మాత్రం ఎన్టీఆర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు.
ఇటీవల వేట్టాయన్ సినిమాను రిలీజ్ చేయగా తెలుగు టైటిల్ పెట్టలేదు అనే విమర్శలు గట్టిగా వచ్చాయి. దీనితో ఇప్పుడు తెలుగులో వార్ 2 కు యుద్ద భూమి అనే టైటిల్ పెట్టాలని అదే ఫైనల్ చేయాలని కోరాడట. దాదాపుగా చిత్ర యూనిట్ ఫైనల్ చేసిందని టాక్. తమిళంలో కన్నడంలో కూడా టైటిల్స్ మారిస్తే రిజల్ట్ ఉంటుందని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉంది. జనవరి లేదా ఫిబ్రవరిలోపు ఎన్టీఆర్ తో షూట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసే సినిమాకు ఎన్టీఆర్ రానున్నాడు.