దేవర కట్టిన గోడ ఎక్కడమే కష్టం… కూల్చేస్తాడట…సాధ్యమా..?

దేవర థియేటర్స్ లోసునామీ క్రియేట్ చేశాక, ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో వసూళ్ల రికార్డులతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా కట్టిన గోడని ఎక్కే పనిలో ఉణ్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

  • Written By:
  • Publish Date - November 6, 2024 / 11:51 AM IST

దేవర థియేటర్స్ లోసునామీ క్రియేట్ చేశాక, ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో వసూళ్ల రికార్డులతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా కట్టిన గోడని ఎక్కే పనిలో ఉణ్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అందుకోసం 11500 థియేటర్లను నమ్ముకున్నాడు. దేవర రికార్డుల కుప్పతో గోడ కాదు, పెద్దమేడే కట్టేశాడు తారక్.. అలాంటి మేడని కూల్చేందుకు రెట్టింపు థియేటర్స్ లో అడుగుపెడతున్నాడు ఐకాన్ స్టార్. కాని అదేం తేలిక కాదు… ఏమాత్రం అటు ఇటైనా, రెండింతల పంచ్ పడే ఛాన్స్ కూడా ఉంది. అసలే దేవర 6855 థియేటర్స్ లో రిలీజై, 510 కోట్ల షేర్ వసూళ్లు, థౌజెండ్ వాలాగా గ్రాస్ వసూళ్లు రాబట్టాడు… దానికి రెట్టింపు థియేటర్స్ లో పుష్ప రాజ్ వస్తున్నాడంటే, వసూళ్లు కూడా దేవర కి డబుల్ ఉండాలి.. కాని అది సాధ్యమా? అలా జరక్క పోతే ఏంటి పరిస్థితి…? కల్కీ, దేవరకి కలిసొచ్చినట్టు పుష్ప 2కి కలిసొచ్చే ఛాన్స్ ఎంత?

దేవర రిలీజ్ కి ముందు, విడుదలయ్యాక, రెండునెల్లయ్యాక ఇలా ఒక్కో సీజన్లో ఒక్కలో రికార్డుల మోత మోగించింది ఈ మూవీ. ముంబై, లక్నోలో భారీ ఓపెనింగ్స్ రావటం, యూఎస్లో అతి తక్కువ టైంలో 10 మిలియన్లు రీచ్ అవటం, నార్త్ ఇండియాలో హిందీ హీరోలనుమించేలా మాస్ లో పూనకాలు తెప్పించటం.. ఇలా చాలా రికార్డులు దేవర ఎకౌంట్ లో పడ్డాయి

510 కోట్ల షేర్ వసూల్లు థౌజెండ్ క్రోర్స్ క్లబ్ లో అడుగుపెట్టేలా గ్రాస్ వసూళ్ల రికార్డులు దేవర సొంతం… అలాంటి దేవర రికార్డులని మీద కన్నేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 11500 థియేటర్స్ లో పుష్ప2 ని రిలీజ్ చేస్తూ, దేవర రికార్డులను బ్రేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు

నిజానికి దేవర వరల్డ్ వైడ్ గా 6855 థియేటర్స్ లో రిలీజ్ అయితే, 20రోజుల్లో సినీ సునామీ వచ్చింది. మరి అలాంటిది 11500 థియేటర్స్ లో పుష్ప2 వస్తోందంటే, కనీసం 1200 కోట్ల నుంచి రెండు వేల కోట్ల వసూళ్లు రావాలి.. ఆరేంజ్ లో దేవర కి రెట్టింపు థియేటర్స్ లో విడుదలౌతోంది కాబట్టి, భారీ అంచనాలే ఉన్నాయి

యూఎస్ లో ఆడియన్స్ ని ముందే పుష్ప 2 కోసం ప్రిపేర్ చేస్తూ, కంగువ రిలీజ్అయ్యే టైం కి పుష్ప పాప్ కార్న్, పుష్ప 2 సోడాలంటూ యూఎస్ లోప్రమోషన్ మొదలు పెట్టింది ఫిల్మ్ టీం. ఇక ఈనెల 15 లేదంటే 16న ట్రైలర్, ఆ మరుసటి రోజు ఐటమ్ సాంగ్ లిరికల్ ప్రోమో, ఆతర్వాత వరుసగా 3 పాటల ప్రోమోలు వదలబోతున్నారు.

ఇన్ని చేసినా పుష్ప రాజ్ మరి దేవరని మించుతాడా అంటే చెప్పలేం.. పుష్పతో ఊర మాస్ మార్కెట్ లోకి బన్నీ ఎంటరైతే అయ్యాడు. మల్లూ అర్జున్ గా మాలీవుడ్ లో కూడా తనకి స్పెషల్ మార్కెట్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ఈజీగా 400 కోట్లు రాబడుతుంది.. కాని నార్త్ ఇండియాలో ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్ లో పుష్ప 2 దుమ్ముదులుపుతుందా అంటే, ట్రైలర్ ఇచ్చే కిక్ ని బట్టి చెప్పొచ్చు.. కాని మరీ ప్రభాస్, ఎన్టీఆర్ రేంజ్ వైబ్రేషన్స్ బన్నీకి వస్తాయని చెప్పలేం… కంటెంట్ బాగుంటే, ఎవరైనా థియేటర్స్ కి వస్తారు… కాని సినిమా భారం అంతా ఒక్కడిగా తనమీదే మోసినట్టు, ఎన్టీఆర్ లా దేవర అనిపించుకోవటం తేలిక కాదు.. దేవర రికార్డుల మోతని బ్రేక్ చేయటం ఈజీకాదు.. కాని 11500 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టే, ఏమాత్రం టాక్ కిక్ ఇచ్చినా చెప్పలేం… అలాని పూర్తిగా నెంబరాఫ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే వండర్స్ జరుగుతాయనుకోలేం…