మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర దూకుడు చూసి, సాయం కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ క్యూ కట్టాడు. ఆలియా కూడా ఎన్టీఆర్ పేరు చెప్పి తన జిగ్రాని తెలుగులో కూడా బానే ప్రమోట్ చేసుకుంది. కాని భారీ ఆకారంతో ఏనుగు నడుస్తుంటే, ఏమాత్రం శత్రువులు కాని చీమలు కింద పడి నలిగిపోయినట్టు, దేవర కింద జిగ్రా నలిగిపోతోంది. కాకపోతే, ఇక్కడే దేవర సాయం తీసుకుంటూనే దేవరకే వెన్నుపోటుని, డమ్మీ వసూళ్లతో ప్లాన్ చేశారు. అదే బెడిసి కొట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వ్యక్తే వెట్టయాన్ తో వస్తే, ఇక్కడ మార్కెట్ లో మూవీ మటాష్ అయ్యింది. దేవరని ఢీ కొడితే, బాక్సాఫీస్ లో మాస్ మటాషే అని తేలింది. ఐతే కొత్త విషయం ఏంటంటే, దేవర సాయం తీసుకుంటూనే, దేవరని మించేలా దొంగ కలెక్షన్స్ తో ఆలియా టీం తప్పు చేసిందా? ఓవైపు ఎన్టీఆర్ మీద కామెంట్లు చేస్తూ యాంటీ ఫ్యాన్స్ తప్పు చేస్తే, దేవరని పొగిడిన జిగ్రా టీం, ఫేక్ కలెక్షన్స్ తో హిస్టారికల్ మిస్టేక్ చేసిందా? బాలీవుడ్ లో పరువుపోయేలా ఇప్పుడీ వివాదం ముదురుతోంది. ఇద్దరు నిర్మాతల మధ్య మాటల యుద్ధం పెరిగింది.. అదేంటోచూసేయండి.
టాలీవుడ్, కోలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ లాంటి దిక్కుమాలిన జబ్బలు ఇంకా రాలేదు. బాలీవుడ్ లో ఈ డిసీజ్ ఎప్పుడో 20ఏల్ల క్రితమే మొదలైంది. సౌత్ లో నెంబరాఫ్ థియేటర్స్ లో ఆడించటం లాంటి ఆర్టిఫిషియల్ తప్పులు నిర్మాతలు చేసుండొచ్చు కాని, కలెక్షన్స్ విషయంలో దొంగలెక్కల చరిత్ర సౌత్ లో 99 పర్సెంట్ లేనట్టే… దేవర వసూళ్లలో జెన్యూనిటీ, హిందీ మూవీ జిగ్రా వసూళ్లలో కన్నింగ్ లెక్కల రియాలిటీ, పోల్చాల్సి రావటమే ఈ ప్రస్థావన రావటానికి కారనం.
హిందీలో ఈ జబ్బు రకరకాలరూపంలో పెరిగిపోయింది. కొందరు 10 కోట్ల వసూళ్లొస్తే, 50 కోట్లొచ్చాయని చెప్పటం ఒక పద్దతి.. కాని, హిందీలో విచిత్రంగా వాళ్ల సినిమా టిక్కెట్లు వాళ్లే కొని, వాళ్ల మనషులతోనే చూపించి, వసూళ్లు పెరిగాయనిపించుకోవటం లాంటి దిక్కుమాలిన ఐడియాలు బాలీవుడ్ వాళ్లకే వస్తాయేయో..
ఆలియా భట్, ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేసింది. ముగ్గురి మధ్య మంచి స్నేహం ఉంది. ఫలితంగా తన జిగ్రా మూవీని సౌత్ లో చాలా ఈజీగా ప్రమోట్ చేసుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పరోక్షంగా జిగ్రాకి సపోర్ట్ చేశారు
అంతవరకు బానే ఉంది. కాని ఈ సినిమా తిప్పి తిప్పి కొడితే, రోజుకి 5.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. కాని మొదటి రోజు 10. 5 కోట్ల వసూళ్లని తర్వాత 14 కోట్లని ఇలా రోజు రోజుకి లెక్కలు పెంచేస్తున్నారు.. కాని థియేటర్స్ లో జనాలు లేక ఈగలు దులుపుకునే పరిస్థితి కనిపిస్తోందని, టీసీరీస్ అధినేత భార్య దివ్యా ఖోస్లా కామెంట్ చేసింది. తను నటిగా, దర్శక, నిర్మాతగా ఇలాంటి ఫేక్ కలెక్సన్స్ ఎందుకు ఎనౌన్స్ చేస్తారంటూ, జిగ్రా మీద ఫైర్ అయ్యింది
దీనికి నిర్మాత కరణ్ జోహార్, ఫూల్స్ కి నిజాలు తెలియవు కాబట్టి, వాళ్ల విషయంలో సైలెంట్ గా ఉండటం ఉత్తమ అన్నాడు. వెంటనే తన కామెంట్ కి దివ్యా ఖోస్లా కూడా నిజాలను ఫూల్స్ జీర్ణించుకోలేకే, సైలెంట్ గా ఉంటారంటూ ఎటాక్ చేసింది
కరణ్ జోహార్ బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకరే, దివ్యా ఖోల్సా కుమార్ ఏకంగా టీ సీరీస్ అధినేత భార్య అలాంటి వీళ్ల మధ్య ఈ కామెంట్ల యుద్ధం తో ఓ విషయం క్లియర్ అయ్యింది. బాలీవుడ్ లో కార్పోరేట్ బుక్కింగ్స్ అన్నది నిజమని తేలింది. అంటే చాలా కంపెనీలకు నిర్మాతలే డబ్బిచ్చి, వాళ్ల ఎంప్లాస్ కి టిక్కెట్లు బుక్ చేసిన ఫ్రీ గాచూపిస్తారు. చూడ్డానికి ఈ మూవీ బాగా ఆడుతోందనే జనాలకు అనిపిస్తుంది… ఈ బిల్డప్ కోసమే 20 ఏళ్లుగా బాలీవుడ్ నిర్మాతలు చాలా డబ్బు తగలేస్తున్నారని తెలుస్తోంది. సో వాళ్లకు అలవాటైన పని కాబట్టి, సౌత్ లో కూడా ఇలానే జరుగుతుందనే బ్రమలు కామన్. కాని ఇక్కడ మనోళ్ళు బారీగా కనిపించే నెంబర్ ని కాదని, గ్రాస్ వసూళ్ల స్థానంలో నిర్మాత షేర్ లెక్కల్ని ఎనౌన్స్ చేయటానికి సిద్దపడ్డారు. ఇక తమిళ మూవీ వెట్టయాన్ వసూళ్ల మీద కూడా డౌట్లు పెరిగాయి. ఎందుకంటే తెలుగులో పెద్దగా టాక్ కాని క్రేజ్ కాని లేదు. దేవర దూకుడు ముందు వెట్టయాన్ నిలవట్లేదు. హిందీలో అసలు వెట్టయాన్ ని చూసిన నాధుడే లేడు.. సో వాళ్లు చెప్పినట్టు 3 రోజుల్లో 300 కోట్ల వసూళ్ల మాటలు నమ్మశక్యంగా లేవు. మొత్తానికి బాలీవుడ్ జబ్బు కోలీవుడ్ కి కూడా సోకిందా అన్న అనుమానాలు కూడా పెరిగాయి. దేవర మాస్ ఎటాక్ కి జిగ్రా, వెట్టయాన్, స్వాగ్ ఇలా చాలా సినిమాలు బలైపోతూనే ఉన్నాయి.