రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆ సినిమా తాలూకు చాలా మార్పులు చేర్పులు, కథలో కాదు, మేకింగ్ లో పెరిగాయి.ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. ఇప్పడే షూటింగ్ మొదలయ్యేలా లేదు. అయినా సందీప్ రెడ్డి స్పిరిట్ మేకింగ్ తాలూకు భారీ నిర్ణయం తీసుకున్నాడు. రెబల్ స్టార్ కి ఉన్న క్రేజ్, ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఊహించని డిమాండ్ చేశాడట సందీప్. బేసిగ్గా పాన్ ఇండియా కింగ్ గా రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్ వల్ల, ప్రభాసే డిమాండ్ చేయాలి… కాని ఇక్కడ కథంతా రివర్స్ రూట్లో నడుస్తోంది. అంటే మహమాటంతో ప్రభాస్ అలాంటి ఛాన్స్ ఇచ్చాడా? లేదంటే సందీప్ రెడ్డి డిమాండ్ లో నిజాయితీ కనిపించిందా? ఇంతకి ఆ డిమాండ్ వెనకున్న కమాండ్ ఏంటి? స్పిరిట్ మూవీ మేకింగ్ లో అంత ఆశ్చర్య కరమైన అంశమేముంది..?
దేవర ఫస్ట్ డే ఏపీలో 7 షోలు పడ్డాయి. తెలంగాణలో 6 షోలు… ఇక మొదటి పదిరోజులు దేవర ఆంధ్రాలో రోజుకి 6 షోలు పడితే, తెలంగాణలో రోజుకి 5 షోలు పడ్డాయి. ఇక ప్రివ్యూ వసూళ్లు అదనం… ఇవన్నీ కలిపి దేవరకి మొదటి రోజు 172 కోట్ల ఓపెనింగ్స్ తెస్తే, తర్వాత 6 రోజుల్లోనే 400 కోట్లు వచ్చేలా చేశాయి..
కాని ఇలాంటి పరిస్థితి డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే పుష్ప 2 కి కష్టమే అనంటున్నారు. పుష్ప పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వొచ్చు. 450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఉండొచ్చు. కాబట్టే పుష్ప 2 మీద భారీ అంచనాలు, హైప్ పెరుగుతుండొచ్చు… అయినా నో యూజ్… ఖచ్చితంగా పుష్ప 2 కి భారీ ఓపెనింగ్స్ రావటం ఇబ్బంది కరంగానే మారింది..
ఎందుకంటే ఏపీలో పుష్ప 2 కి మొదటి రోజు 7 షోలు వేసుకునే వెసులు బాటు రావటం కష్టం. తర్వాత పదిరోజులు రోజులకి 6 షోలు, అలానే భారీగా టిక్కెట్ రేటు పెంచుకునే వెసులు బాటు కష్టం.. అంటే ఏపీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వటం వల్లో, తనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య దూరం పెరగటం వల్లో ఈ సమస్య రావట్లేదు.
అసలు సమస్య వేరే ఉంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బిజీ, అలానే సినిమా సమస్యలేవైనా తానే సాల్వ్ చేస్తాడు కాని, మధ్యలో ఓ కిరికిరీ ఉందట. అదే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్… తనని దాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఏసినీ పెద్ద కలిసే ఛాన్స్ లేదంటున్నారు. ఒకవేళ కలిసినా పవన్ మళ్యీ వాళ్లని త్రివిక్రమ్ దగ్గరకే పంపేస్తాడనంటున్నారు. అక్కడే పుష్ప 2 టీంకి చిక్కొచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. వాళ్లు ఏపీలో పుష్ప 2 స్పెషల్ షో కాని, టిక్కెట్ రేట్ల విషయం కాని పవన్ తో మాట్లాడాలంటే త్రివిక్రమ్ ని కలవక తప్పదనంటున్నారు. అది జరగే పని కాదు. త్రివిక్రమ్ తర్వాత మూవీ అల్లు అర్జున్ తోనే అయినా, ఇక్కడ ఇబ్బంది నిర్మాతలతో త్రివిక్రమ్ కి కాబట్టి బన్నీ సీన్ లోకి వస్తాడని చెప్పలేం. ఎలాగూ పవన్ తో బన్నీకి గ్యాప్ ఉంది కాబట్టి, అలా కూడా కష్టమే.. సో ఏపీలో పుష్ప 2 కి ఎక్కువ షోలు, ఎక్కువ టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు రాకపోతే, వసూళ్లు తగ్గుతాయా అంటే, సినిమా బాగుంటే తగ్గవు.. కాని ఓపెనింగ్స్ తాలూకు నెంబర్ పెరగాలంటే, టిక్కెట్ రేట్లు, ఎక్కువ షోలు పడితేనే ఇంత భారీ బడ్జెట్ సినిమాకు గిట్టుబాటవుతుంది
అసలే బాలీవుడ్ తర్వాత ఇండియాలో అతి పెద్ద మార్కెట్ అంటే, తెలుగుదే… తెలంగాణ, ఆంధ్ర రెండీంట్లో ఎక్కడ వసూళ్లకు నష్ట జరిగినా, అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అందుకే పుష్ప 2 టీం కి దేవర రికార్డులు బద్దలు కొట్టడం కాదు, రీచ్ అవటం కూడా కష్టమే అంటున్నారు.