దేవర ట్రైలర్ 2, ఆల్రెడీ కటింగ్ అయిపోయింది…?

దేవర సినిమాపై ఉన్న అంచనాలకు ఆ సినిమా ట్రైలర్ కు ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం వాస్తవం. డైలాగ్స్ విషయంలో జనాలు చాలా ఊహించుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 20, 2024 / 12:40 PM IST

దేవర సినిమాపై ఉన్న అంచనాలకు ఆ సినిమా ట్రైలర్ కు ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రం వాస్తవం. డైలాగ్స్ విషయంలో జనాలు చాలా ఊహించుకున్నారు. కాని నీరు గార్చింది దేవర ట్రైలర్. సినిమాకు ఒక పక్కన భారీగా బజ్ క్రియేట్ అవుతూ ఓవర్సీస్ లో విడుదలకు ముందే కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్న సినిమాకు ట్రైలర్ నెగటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చింది. ట్రైలర్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేసారు. కథ చెప్పేశారు అంటూ మండిపడ్డారు కూడా.

అందుకే ఇప్పుడు దేవర టీం ప్లాన్ బీ రెడీ చేసింది. ఆ ట్రైలర్ తో వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ మొత్తాన్ని తుడిచేసి ఫ్యాన్స్ కి సినిమా జనాలకు దేవర జాతర ఏ రేంజ్ లో ఉంటే బాగుంటుందో ప్లాన్ చేస్తోంది. సినిమాకు పబ్లిసిటీ ఆ ట్రైలర్ తో పీక్స్ కి తీసుకు వెళ్లాలని భావిస్తోంది చిత్ర యూనిట్. రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవర నుంచి గుడ్ న్యూస్ రానుంది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో దేవర ట్రైలర్ 2 ని విడుదల చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించి కటింగ్ కూడా పూర్తి చేసారు.

విలన్ సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఒక యాక్షన్ సీన్ బిట్ కూడా ఈ ట్రైలర్ లో గ్రాండ్ గా చూపించాలని భావిస్తోంది టీం. ఇక జాన్వీ కపూర్ సినిమాకు మైనస్ అనే టాక్ వస్తోంది. ఆ టాక్ కి కూడా ఆన్సర్ చేయాలని దేవర టీం భావిస్తోంది. ఈ నెల 22 న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. అక్కడే ట్రైలర్ ను విడుదల చేసి తెలుగు ఫ్యాన్స్ ని కూడా ఖుషీ చేయాలని భావిస్తోంది. మొదటి ట్రైలర్ విషయంలో తెలుగు వాళ్ళను పట్టించుకోలేదు అని ఆరోపణలు వచ్చాయి. అందుకే ఇప్పుడు తెలుగు వాళ్ళ కోసం ట్రైలర్ 2 ని ప్లాన్ చేసింది టీం.