NTR vs Ram Charan : దేవర’ వర్సెస్ ‘గేమ్ ఛేంజర్’.. బిగ్గెస్ట్ వార్..

ఆర్ఆర్ఆర్ (RRR) లో ప్రధాన పాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), రామ్ చరణ్ (Ram Charan) ఎంత స్నేహంగా ఉంటారో.. ఆ సినిమా కారణంగా ఆ హీరోల అభిమానులు అంత బద్ద శత్రువులుగా మారారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ (RRR) లో ప్రధాన పాత్రలు పోషించిన జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), రామ్ చరణ్ (Ram Charan) ఎంత స్నేహంగా ఉంటారో.. ఆ సినిమా కారణంగా ఆ హీరోల అభిమానులు అంత బద్ద శత్రువులుగా మారారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నారు. సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. మా హీరోనే మెయిన్ హీరో, మా హీరోనే గొప్ప నటుడు, మా హీరో వల్లే కలెక్షన్స్ వచ్చాయి అంటూ తమ అభిమాన హీరోని పోగొడుతూనే వేరే హీరోని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తమిళ హీరోలు విజయ్, అజిత్ అభిమానుల మధ్య గొడవలను తలపించేలా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే రాబోయే రోజుల్లో వీరి మధ్య గొడవ మరో స్థాయికి చేరేలా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ బాక్సాఫీస్ వార్ కి దిగే అవకాశం కనిపిస్తోంది.

ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ సెప్టెంబర్ లో విడుదలైతే మాత్రం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో తలపడే అవకాశముంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ ను కూడా సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ అవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరుతుంది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నుంచి వస్తున్న సినిమాలివే. చరణ్ ‘ఆచార్య’ (Acharya) లో నటించినప్పటికీ ఆ సినిమాలో ఆయన హీరో కాదు.. కేవలం కీలక పాత్ర పోషించాడు. అసలే ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు, దానికి తోడు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హీరోగా నటంచిన మొదటి సినిమాలు. అలాంటిది ఈ రెండు సినిమాలు క్లాష్ కి దిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.