Devara Vs Kalki: కొత్త రిలీజ్ డేట్స్.. దేవరతో మారిన లెక్కలు

'దేవర' పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎన్టీఆర్ కదన రంగంలో దూకిన టైగర్ మాదిరిగా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ సెటప్ చూస్తుంటే, ఇది మట్టి కుస్తీలో భాగంగా జరిగే ఫైట్ సీన్‌లోని స్టిల్ అని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 17, 2024 / 12:45 PM IST

Devara Vs Kalki: 2024లో అప్పుడే నెలన్నర రోజులు ముగిసిపోయాయి. ఇక.. రానున్న రోజుల్లో లైన్లో ఉన్న భారీ మూవీస్ పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోందన్నది ఫిక్సయిపోయింది. అయితే.. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర పార్ట్ 1 కాస్తా వెనక్కి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. దీంతో.. మిగతా హీరోల సినిమాల రిలీజ్‌ డేట్లపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.

Kalki 2898 AD: లీకుల బెడద.. కల్కి లీక్డ్ వీడియో మామూలుగా లేదా..!

దేవర సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో విడుదల కాబోయే కొత్త సినిమాలపై చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ కన్‌ఫామ్ అయిన సినిమాల ప్రకారం చూస్తే.. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న, కల్కి మే9న, డబుల్ ఇస్మార్ట్ జూన్ 14, పుష్ప-2 ఆగస్టు 15న, సరిపోదా శనివారం ఆగస్టు 29న, ఓజీ సెప్టెంబర్ 27న, దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కానున్నాయి. అయితే.. వీటన్నింటిలో ముందుగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన దేవర మూవీ కాస్తా అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫిక్సయిన మిగతా సినిమాలు ఫిక్సయిన డేట్‌కు రిలీజ్ అవుతాయా లేక ఏవైనా వాయిదాలుంటాయా అన్న డౌట్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి దేవర మూవీ రిలీజ్ ఆలస్యం కావడంతో.. మిగతా సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ‘దేవర’ పార్ట్ 1 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎన్టీఆర్ కదన రంగంలో దూకిన టైగర్ మాదిరిగా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ సెటప్ చూస్తుంటే, ఇది మట్టి కుస్తీలో భాగంగా జరిగే ఫైట్ సీన్‌లోని స్టిల్ అని తెలుస్తోంది.

‘కల్కి 2898 AD’ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ స్టిల్ కూడా కూడా దాదాపు ఇలానే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్‌కు తగ్గట్టుగా రెబల్ స్టార్ ఒక వారియర్‌గా బరిలోకి దూకుతున్నట్లుగా కనిపిస్తారు. ఈ రెండు సినిమాలకు అస్సలు సంబంధమే లేనప్పటికీ, చూడ్డానికి ఇద్దరు హీరోల స్టిల్స్ సేమ్ టూ సేమ్ ఉండటంతో నెటిజన్లు కంపేరిజన్స్ మొదలుపెట్టారు. మరీ ఐదు నెలల గ్యాప్‌లో విడుదల అవుతున్న ఈరెండు మూవీలు బాక్సాపీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.