దేవర సినిమా ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. దేవర సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత దేవర 2 కూడా రెడీగా ఉంది. ఓ హిందీ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దేవర హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కెరీర్ చాలా స్పీడ్ గా దూసుకెళ్తుంది అనడంలో ఏ సందేహం లేదు. ఇతర భాషల మీద కూడా ఫోకస్ పెట్టి నటిస్తున్నాడు. వార్ 2 లో నటిస్తున్నాడు అలాగే కాంతారా ప్రీక్వెల్ లో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం కనపడుతోంది.
ఇలాంటి సమయంలో మరో భారీ ప్రాజెక్ట్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కనపడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చెన్నైలో సినిమాకు ప్రమోషన్స్ చేసిన సందర్భంగా ఓ వ్యాఖ్య చేసారు. తమిళంలోనే సినిమా చేసి తెలుగులో డబ్ చేస్తాను అని ప్రకటించాడు. అసురన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన వెట్రిమారన్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. ఎన్టీఆర్ ఆ మాట చెప్పిన గంటల వ్యవధిలో ఎన్టీఆర్ తో సినిమా చేస్తా అంటూ వెట్రి ప్రకటించారు. దీనికి సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
తన చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయని, అవి పూర్తైన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తా అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు. కథ కూడా సిద్దంగా ఉందని ఆ కథ గురించి ఎన్టీఆర్ కు వివరించా అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎప్పుడు మొదలుపెడతారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.