NTR : దుబాయ్ లో దేవర బర్త్ డే పార్టీ

ఇప్పటికే నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

 

 

 

ఇప్పటికే నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్నా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే.. ఈసారి బర్త్ డే వేడుకలను విదేశాల్లో ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. మొన్నటి వరకు ముంబైలో వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు.

ఇక ఇప్పుడు బర్త్ డే వెకేషన్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లాడు. దుబాయ్ వెళ్లినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్‌కు వెళ్తున్న ఎయిర్ పోర్ట్‌ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఈసారి టైగర్ బర్త్ డే వేడుకలు విదేశాల్లోనే జరగనున్నాయని చెప్పొచ్చు. తిరిగొచ్చిన తర్వాత దేవర షూటింగ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే, ఆ రోజు అభిమానులకు పెద్ద పండగ అని చెప్పాలి.

ఆరోజు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో టైగర్ బర్త్ డే రచ్చ మామూలుగా లేదు. మే 20న టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను కబ్జా చేయడం పక్కా. మరోవైపు ఎన్టీఆర్ కూడా బర్త్ డే సందర్భంగా అప్ కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దేవర ఫస్ట్ సాంగ్‌తో పాటు, వార్ 2 ఫస్ట్ లుక్, ఎన్టీఆర్ 31 అప్టేట్ బయటికి రానున్నాయి