జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సెప్టెంబర్ 27,న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు అమెరికాలో భారీ బజ్ క్రియేట్ అయింది. ప్రత్యంగిరా సినిమాస్ ఎన్టీఆర్ అమెరికాలో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇటీవలే అమెరికాలో ప్రీ-బుకింగ్ ప్రారంభం కాగా సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. 15 వేల టికెట్ లు ప్రీ బుకింగ్ కి అమ్ముడైన తొలి సినిమాగా దేవర నిలవడంతో చిత్ర యూనిట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇప్పుడు మరో రికార్డ్ ని ఈ సినిమా తమ ఖాతాలో వేసుకుంది. 8 లక్షల డాలర్లను వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ లో 25 వేల టికెట్లను విక్రయించారని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ట్రెండ్‌ను బట్టి చూస్తే, యూట్యూబ్‌లో ట్రైలర్ డ్రాప్ అయ్యే సమయానికి మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అంటున్నారు అమెరికా జనాలు. అమెరికాలో ప్రీమియర్లకు 18 రోజులు మిగిలి ఉండగానే ఈ రేంజ్ లో ఈ సినిమాకు స్పందన వస్తోంది.
అమెరికాలో ఈ రేంజ్ లో వసూలు చేసిన మొదటి సినిమా దేవర కావడం విశేషం. మిలియన్ డాలర్లు వసూలు చేస్తే మాత్రం బాలీవుడ్ కి ఇక కంటి మీద కునుకు ఉండదు. ఇక అమెరికాలో క్రేజ్ చూసిన ఇక్కడి జనాలు కూడా ప్రీ బుకింగ్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గనుక ఎవరూ ఊహించని విధంగా వసూలు చేస్తే మాత్రం ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోతుంది. తర్వాతి ప్రాజెక్ట్ లు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.