సినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు అనే దాని కంటే ఆ సినిమా కోసం హీరో ఎంత ప్రాణం పెట్టాడు అనేదే కీలకం. ఏ సినిమా అయినా హిట్ కావాలంటే… హీరో కీలకం. నటన విషయంలో గాని డైలాగుల విషయంలో గాని డాన్స్ గాని ఏదైనా సరే హీరో కీ రోల్. ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు కథ లేకపోయినా తమ యాక్షన్ తో సినిమాలను హిట్ కొట్టేస్తున్నారు. మన తెలుగులో హీరోల్లో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. మాస్ సినిమాలు, నాలుగు ఫైట్ లు, నాలుగు డాన్స్ లు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చారు.
సినిమా అంటే యాక్షన్ ఉండాల్సిందే, ఆడియన్స్ కి డిఫరెంట్ గా చూపించాల్సిందే అని డిసైడ్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి హీరో విషయంలో అయితే ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ ఎలా ఉన్నా సరే… సినిమా ఫెయిల్ అయినా ఎన్టీఆర్ మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. డైరెక్టర్ ఏది అడిగినా సరే సినిమా కోసం చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉంటాడు. దేవర సినిమా విషయంలో ఇది పక్కాగా ప్రూవ్ అయింది. సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.
నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడం అనేది ఈజీ కాదు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీలో కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పేసాడు. ఇది చూసి టాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు. సినిమా ఇతర భాషల్లో కూడా మార్కెట్ చేయడానికి ఇదే కీ రోల్ అయింది. సొంతగా డబ్బింగ్ చెప్పాడు కాబట్టే కన్నడ, తమిళ జనాల ఇగో సాటిస్ఫై అయింది. ఇప్పుడు వార్ 2 విషయంలో కూడా ఎన్టీఆర్ అదే చేస్తున్నాడు. సినిమాను ఏకంగా మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి రెడీ అయ్యాడు. సెట్స్ లోనే కన్నడ, తెలుగు షూట్ కూడా చేయడానికి ఓకే చెప్పాడు.
ఈ రెండు భాషల్లో డైలాగులు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పాడో హిందీలో కూడా అలానే చెప్తున్నాడట. అలాగే డాన్స్ విషయంలో హృతిక్ రోషన్ ను బీట్ చేయడం కష్టమని అయాన్ ముఖర్జీ ఫీల్ అయితే… సాంగ్ లో అంతకు మించి చేసాడట ఎన్టీఆర్. దీనితో ఎన్టీఆర్ టాలెంట్ కు అయాన్ ఫిదా అయిపోయాడు. పర్ఫెక్ట్ యాక్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సినిమా షూట్ జనవరికి కంప్లీట్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొంటాడు.