Ntr…naga chaythana : దేవరతో తండేల్ ఢీ..!

టాలీవుడ్‌ (Tollywood)లో వరుస భారీ సినిమాలు రాబోతున్నాయి. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్.. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండేల్ అన్న టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడింది.

టాలీవుడ్‌ (Tollywood)లో వరుస భారీ సినిమాలు రాబోతున్నాయి. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ (Geeta Arts) లో సినిమా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action Entertainer) తండేల్.. చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్రాండ్ తో సిద్ధం అవుతోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండేల్ అన్న టైటిల్‌తో వస్తున్న ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడింది. తండేల్‌గా నాగ చైతన్య గెటప్‌తో రిలీజ్ చేసిన ఫోటో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ తండేల్ మూవీ మరో పెద్ద మూవీతో ఢీ కొట్టబోతుందన్న న్యూస్ ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

తండేల్‌ (Tandel) లో.. బోటుని నడిపే ఫిషర్ మెన్ గా.. గెడ్డంతో రఫ్ లుక్ లో చైతన్య ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేశాడు. యాక్షన్ అండ్ లవ్ స్టొరీగా పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సరిగ్గా దసరా పండుగకి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. సరిగ్గా ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. తండేల్ దేవర తో ఢీ కొట్టబోతున్నాడా అన్న న్యూస్ వైరల్‌గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర పార్ట్ 1 యమ స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ (NTR) చేస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అయితే.. దేవర పార్ట్ 1 కూడా అక్టోబర్ లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి.. అటు.. తండేల్‌ కూడా అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. తమ కంటెంట్ పై తండేల్ మేకర్స్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి.. ఈ రెండు చిత్రాలు అక్టోబర్‌ బరిలో దిగితే.. ఇద్దరి మూవీల మధ్య క్లాష్ వచ్చే అవకాశముంటుంది. బాక్సాఫీస్ దగ్గర దీని ప్రభావం కూడా భారీగానే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ రెండు చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలో దిగుతాయా? లేదా? తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..