ఓవర్సీస్ మార్కెట్” ఇప్పుడు పాన్ ఇండియా హీరోలకు ఇదొక కనపడని టార్చర్. మన పాన్ ఇండియా హీరోల సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో ప్రీ బుకింగ్ జరుపుకుంటాయి అనేదే సెన్సేషన్ అవుతుంది. సినిమా క్రేజ్ కూడా ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమాకు అమెరికాలో భారీగా ప్రీ బుకింగ్ మార్కెట్ జరిగింది. ఆ తర్వాత పుష్పా 2 సినిమాకు కూడా అమెరికాలో భారీగా ప్రీ బుకింగ్ మార్కెట్ జరుపుకోవడంతో ఇతర స్టార్ హీరోలు కూడా అమెరికాలో ప్రీ బుకింగ్ మార్కెట్ పై సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు.
అమెరికాలో మన సినిమాలకు ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో ఈ ప్రీ బుకింగ్ మార్కెట్ స్పష్టంగా చెప్పేస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ బుకింగ్ మార్కెట్ పై కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు నిర్మాతలు. అమెరికాలో ఏ రేంజ్ లో ప్రీ బుకింగ్ మార్కెట్ జరుగుతుందని రామ్ చరణ్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈ నెల 21న అమెరికాలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన పరిస్థితి లేదు.
దాదాపు 7 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సినిమా టీజర్ అలాగే సాంగ్స్ పై కూడా మంచి రెస్పాన్స్ ఉంది. దీనితో ప్రీ బుకింగ్ మార్కెట్ పై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ చిన్న షాక్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఖుషి సినిమా అమెరికాలో 127 లొకేషన్స్ లో 290 షోస్ కోసం 3334 టికెట్ లు బుక్ అయ్యాయి. ఇక అప్పుడే 55,761 డాలర్లు వసూలు చేసింది ఆ సినిమా.
విజయ్ దేవరకొండ రేంజ్ కు ఇది చాలా ఎక్కువ అయితే ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఇప్పటివరకు 1235 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. 360 షోస్ కోసం 127 లొకేషన్స్ లో 35967 డాలర్లు వసూలు చేసింది. 127 లొకేషన్స్ లో ఖుషి సినిమా ఆ రేంజ్ లో వసూలు చేస్తే రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా మాత్రం దాదాపు 20 వేల డాలర్లు తక్కువగా వసూలు చేయడం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ట్రైలర్ కూడా అమెరికాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.