DHANUSH MOVIE SHOOTING: వివాదంలో ధనుష్ సినిమా.. అలిపిరిలో షూటింగ్‌పై భక్తుల ఆగ్రహం

టెంపుల్ సిటీలో షూటింగ్ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, షూటింగ్ జరిపితే అడ్డుకుని తీరుతామని బీజేపీ హెచ్చరించింది. మరోవైపు.. ఇక్కడ షూటింగ్ జరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 06:21 PM IST

DHANUSH MOVIE SHOOTING: తమిళ స్టార్ ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తిరుపతి, అలిపిరిలోని గోవిందరాజస్వామి ఆలయం దగ్గర జరుగుతోంది. బుధవారం కూడా గోవిందరాజస్వామి ఆలయం వద్దే షూటింగ్ ఉంది. అయితే, టెంపుల్ సిటీలో షూటింగ్ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, షూటింగ్ జరిపితే అడ్డుకుని తీరుతామని బీజేపీ హెచ్చరించింది.

Pawan Kalyan: హిస్టరీ రిపీట్.. అప్పుడు ‘అత్తారింటికి దారేది’.. ఇప్పుడు ఓజీ

మరోవైపు.. ఇక్కడ షూటింగ్ జరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అలిపిరి రోడ్డులో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ మూలంగా భక్తులు, విద్యార్థులు, అంబులెన్స్‌లు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపై ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేయించారని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మీడియాపై కూడా దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అలాగే.. అక్కడి దృశ్యాల్ని చిత్రీకరించిన కొందరి సెల్‌ఫోన్లు లాక్కున్నారని కూడా సమాచారం. తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వవద్దని బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధ్మాత్యిక క్షేత్రమైన తిరుమల రోడ్లపై షూటింగ్‌కు అనుమతి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి షూటింగ్‌కు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

షూటింగ్ అడ్డుకుని తీరుతామని, భక్తులకు ఇబ్బంది కలిగించిన చిత్ర హీరో ధనుష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. ఈ అంశం వివాదాస్పదం కావడంతో పోలీసులు స్పందించారు. రేపటి షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలా.. వద్దా.. ఇస్తే ఎలాంటి రూల్స్ పెట్టాలి.. ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అధ్వర్యంలో సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం షూటింగ్‌కు అనుమతించేది.. లేనిది తెలుస్తుంది. దీంతో పోలీసుల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.