అయితే సమంత మెంటల్ కండీషన్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సమంత ప్రస్తుతం చాలా డిప్రెషన్‌లో ఉందని.. చాలా సార్లు సూసైడ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించిందంటూ ట్వీట్ చేశాడు ఉమైర్ సందు. ఈ విషయం సమంత దగ్గర ఉండే పర్సనల్ టీం ద్వారా తనకు తెలిసిందని చెప్పాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం ఏమీ బాగాలేదంటూ ట్వీట్ చేశాడు. ఉమైర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేంత డిప్రెషన్ సమంతకు ఎందుకంటూ ఆమె ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఉమైర్‌ను నానా మాటలు అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి చాలా విషయాలు ఆధారాలు లేకుండా రాసి గతంలో ఉమైర్ విమర్శపాలయ్యాడు. నిజానిజాలు తెలియకుండా సెలబ్రెటీల గురించి ఆర్టికల్స్ రాస్తుంటాడని ఉమైర్‌కు బ్యాడ్‌నేమ్ కూడా ఉంది. దీంతో అంతా అతన్ని తిట్టిపోస్తున్నారు. సమంత చాలా కూల్‌గా తన ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తప్పుడు న్యూస్ సర్క్యులేట్ చేసివాడిపై పోలీస్ కేస్ పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు.