మనోజ్ ను రోడ్ మీదకు ఈడ్చేసారా…? సామాన్లు బయటపడేస్తున్న మోహన్ బాబు

మంచు మోహన్ బాబు... కొడుక్కు ఇల్లు లేకుండా రోడ్ మీదకు లాగేసారా...? జల్పల్లి ఇంట్లో మోహన్ బాబు.. మంచు మనోజ్ సామాగ్రిని బయటకు లాగడం వెనుక ఉద్దేశం ఏంటీ...? ఇప్పుడు సోషల్ మీడియాను, తెలుగు సినిమాను ఈ ప్రశ్నలు ఊపెస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - December 11, 2024 / 12:54 PM IST

మంచు మోహన్ బాబు… కొడుక్కు ఇల్లు లేకుండా రోడ్ మీదకు లాగేసారా…? జల్పల్లి ఇంట్లో మోహన్ బాబు.. మంచు మనోజ్ సామాగ్రిని బయటకు లాగడం వెనుక ఉద్దేశం ఏంటీ…? ఇప్పుడు సోషల్ మీడియాను, తెలుగు సినిమాను ఈ ప్రశ్నలు ఊపెస్తున్నాయి. రెండు రోజుల నుంచి మంచు ఫ్యామిలీ ఇష్యూ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాక సినిమా పెద్దలు కూడా సైలెంట్ గా చూస్తున్నారు. ఇక వీరి మధ్య రాజీ కుదర్చడానికి చిన్న శ్రీశైలం యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

ఇక మంగళవారం మధ్యాహ్నం మంచు విష్ణు దుబాయ్ నుంచి రాగా… మోహన్ బాబు స్వయంగా విష్ణును ఇంటికి తీసుకుని వెళ్ళారు. మోహన్ బాబు స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి తీసుకు రావడం హాట్ టాపిక్ అయింది. ఇక మనోజ్ పై ఇప్పటికే మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో ఆయన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసారు. దీనిపై మనోజ్ సీరియస్ అయ్యాడు. కనీసం పోలీసులు తన వాదన వినే ప్రయత్నం కూడా చేయలేదని వాపోయాడు. ఇక తన భార్యతో కలిసి మోహన్ బాబు ఇంటికి వెళ్ళాడు మనోజ్.

ఆ సమయంలో అక్కడ మంచు విష్ణుకు చెందిన బౌన్సర్లు కూడా మొహరించారు. దీనితో ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఆ తర్వాత అక్కడికి పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఏం జరగకుండా జాగ్రత్తలు పడ్డారు. ఇక తాజాగా మంచు కుటుంబ వివాదం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంచు మనోజ్ సామాగ్రి షిఫ్ట్ చేస్తున్నారు మోహన్ బాబు సిబ్బంది. జల్పల్లి లోని మంచు మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పోలీసులు అక్కడ భారీగా భద్రత ఏర్పాటు చేసారు. మంచు మనోజ్ సామగ్రి ని వెహికల్ లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేసారు.

మోహన్ బాబు ఇల్లు కావడం తో మనోజ్ రావడానికి వీలు లేదని మోహన్ బాబు వాదిస్తున్నారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించేందుకు సిద్ధం చేసారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసుల సహాయం తో మనోజ్ సామగ్రి ని తలించునున్న సిబ్బంది… వాటిని ఎక్కడికి తీసుకుని వెళ్తారు అనేది క్లారిటీ లేదు. అయితే ఆ సామాగ్రిని భూమా అఖిల ప్రియ ఇంటికి తరలించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీ ని కలిసిన మంచు మనోజ్… ఓ లేఖను కూడా అందించారు. మనోజ్ కు అతని భార్యకు మద్దతుగా భూమా అఖిల ప్రియ హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో మనోజ్ బౌన్సర్లు ను సైతం విష్ణు బౌన్సర్లు బయటకు పంపారు.