టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ లో అయినా ఒక్క సినిమా సూపర్ హిట్ కొడితే హీరోకే కాదు డైరెక్టర్ కు కూడా స్టార్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ లు అందరూ అలా ఇమేజ్ తెచ్చుకున్న వాళ్ళే. ఇక ఈ మధ్య కాలంలో కొందరు డైరెక్టర్ లు ఆలస్యంగా సినిమాలు చేస్తూ ఎప్పుడో ఒక సినిమా విడుదల చేసినా ట్రెండ్ సెట్ చేయడంలో తమ దమ్ము చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ రాజమౌళి సెట్ చేసినా తర్వాత కొందరు డైరెక్టర్ లు మాత్రం బాగా ఫాలో అవుతున్నారు. కొరటాల శివ, నాగ అశ్విన్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు.
ఇక స్టార్ డైరెక్టర్ అనే ఇమేజ్ వస్తే లగ్జరీ లైఫ్ కు ఏ మాత్రం తిరుగు ఉండదు. ఖరీదైన కార్లు, ఖరీదైన ఇళ్ళు, ఇలా అన్నీ లగ్జరీగానే ఉంటాయి. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. చిన్న చిన్న హీరోలు కూడా లగ్జరీగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులో నాగ్ అశ్విన్ ముందు వరుసలో ఉంటాడు అనే మాట వాస్తవం. చేసింది మూడు సినిమాలే. కాని మూడు సూపర్ హిట్ లు, కల్కీ సినిమాతో అయితే బాలీవుడ్ కు కూడా ఓ టార్గెట్ ఫిక్స్ చేసాడు. ఇప్పుడు ఆ టార్గెట్ అందుకోవడానికి బాలీవుడ్ కు చుక్కలు కనపడటం ఖాయం.
ఇక అతని లైఫ్ విషయానికి వస్తే అన్నీ సింపుల్ గానే ఉంటాయి. అశ్వినీ దత్ కు అల్లుడు అయినా కూడా నాగ్ అశ్విన్ మాత్రం చాలా కూల్ గా సామాన్యుడుగా బ్రతుకుతూ ఉంటాడు. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో చాలా సింపుల్ గా కనిపించాడు. కల్కి సినిమా రిలీజ్ టైమ్ లో ఆయన వాడిన చెప్పులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. పని ధ్యాసలో పడి ఎవరో ఒకరి చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా అని చెప్తూ ఉంటాడు ఈ డైరెక్టర్.
ఆయన మామ, నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ కూడా అదే చెప్పారు. నిలో పడి ఎవరి చెప్పులు వేసుకెళ్తాడో తెలీదు, పని తప్ప వేరే ధ్యాసే ఉండదన్నారు. ఇక తన ఇంటి బయటి నిర్మాణాలను కూడా చెత్త వేస్టేజ్ తో నిర్మించడం ఓ సంచలనం. నాగ్ అశ్విన్ వాడే కారు విషయానికి వస్తే… ధర రూ. 5 లక్షల కంటే తక్కువ. మేడ్ ఇన్ ఇండియా కారు అయిన… మహేంద్ర ఈవను వాడతాడు. మార్కెట్‌లో దీని విలువ రూ. 2.50 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ఉంటుంది. దీని ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.