దేవరని చంపింది వర కాదా..? 2000 కోట్ల ప్రశ్నకు సమాధానం…!

దేవర ఒక విషయంలో బాహుబలితో పోలిక పెట్టారు... దేవర క్లైమాక్స్ అచ్చంగా బాహుబలి క్లైమాక్స్ తో పోలుతోందన్నారు. దేవర 2 కోసం ఎదురుచూసే జనం బాహుబలి 2 కోసం ఎదురుచూసినట్టే చూడక తప్పదన్నారు. ఇది నిజమే...

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 10:22 AM IST

దేవర ఒక విషయంలో బాహుబలితో పోలిక పెట్టారు… దేవర క్లైమాక్స్ అచ్చంగా బాహుబలి క్లైమాక్స్ తో పోలుతోందన్నారు. దేవర 2 కోసం ఎదురుచూసే జనం బాహుబలి 2 కోసం ఎదురుచూసినట్టే చూడక తప్పదన్నారు. ఇది నిజమే… కాకపోతే బాహుబలి 2 కథకి,దేవర 2 కథకి ఎలాంటి లింక్ లేదని తేలుతోంది. దేవర 1 తీసేప్పుడే దేవర 2 కథ సిద్దం చేసిన కొరటాల శివ, తన మనసు మార్చుకున్నాడు. దేవర 2 కథలో మార్పుకు అడుగులు ముందుకేశాడు. దేవర 2 ఫైనల్ స్క్రీప్ట్ రెడీ చేయటమే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వినిపించాడు కూడా…. మరి తారక్ ఏమన్నాడు..? దేవర 2 కథని ప్రెస్ మీట్ లో ఫిల్మ్ టీం చెప్పబోతోందా? కథ చెప్పాక ఇక సినిమా తీయటం దేనికి? అసలు కొరటాల శివ, ఎన్టీఆర్ ఉద్దేశ్యం ఏంటి? దేవర 2 ఎలా ఉండబోతోంది? ఎప్పుడో సెట్స్ పైకెళుతుందనంటున్నారు, కాని ముహుర్తం కూడా కుదిరిందని తెలుస్తోంది. మరి ఆ ముహుర్తం ఏంటి?

దేవర పార్ట్ 1 వచ్చింది.. వచ్చి రాగానే ఇక పార్ట్ 2 తో పనేంటి అన్నారు. పార్ట్ వన్ పనైపోయింది. ఇక ఇది భారీతీయుడు 2 తర్వాత అనుకున్న భారతీయుడు 3 లానే దేవర 2 కి ఛాన్స్ లేదన్నారు.. కట్ చేస్తే రోజు రోజుకి దేవర టాకే కాదు, కలెక్షన్ల కిక్ మారిపోతోంది. ఎవరికి అర్ధం కావట్లేదు.
దేవర సక్సెస్ నిజంగా హీరోకి, దర్శకుడికి, ఫ్యాన్స్ కి తప్ప తెలుగు, హిందీ ఆడియన్స్ కి తప్ప చాలా వరకు చాలామంది ఎనలిస్ట్ లకు రివ్యూ రైటర్లకు అర్ధం కావట్లేదు.

ఇదో విచిత్రంగా వాళ్లకు కనిపిస్తోంది. దేవర మీద బాలీవుడ్ కుళ్లు బ్యాచ్, అరవ అతి బ్యాచ్ ఎంత ఏడ్చినా, ఓవరాల్ వసూళ్లు మతిపోగొడుతున్నాయి. దీంతో అర్జంట్ గా దేవర 2 కి రంగం సిద్దం చేసేస్తున్నాడు కొరటాల శివ. ఇంతకి కథేంటి? బాహుబలి 2 తో దేవర 2 కి పోలీకలు ఉత్తుత్తి మాటలే అనటనికి కారణం ఏంటనే ప్రశ్నలకు సమాధానం దొరకబోతోంది.

బేసిగ్గా దేవర తర్వాత హిందీ మూవీ వార్ 2 ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఆతర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ గా గన్ పేల్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు దేవర 2 కి ఛాన్స్ లేదు.

అంటే కనీసం ఏడాదిన్న తర్వాతే దేవర 2 పట్టాలెక్కే అవకాశం ఉంది. కాని ఈలోపే దేవర ఊపు చూసి, సాధ్యమైనంత త్వరగా దేవర 2 ని పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చిందట ఫిల్మ్ టీం. కాకపోతే వార్ 2 లొ తన పాత్ర వరకు షూటింగ్ డిసెంబర్ కి పూర్తవుతుందట. తర్వాత పూర్తిగా ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతోనే ఎన్టీఆర్ బిజి అయ్యే అవకాశం ఉంది.

మరెలా దేవర 2 తీస్తారనే డౌట్ రావొచ్చు.. ఐతే దేవర 2 లో 90 శాతం వర పాత్రే ఉంటుందట. కాబట్టి వర గెటప్ ని మేయింటేన్ చేయటం కష్టమైన పనికాదు. అందుకే దేవర 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ రెండూ ప్యార్ లల్ గా తీయాలనుకుంటున్నారట. ఎలాగూ డ్రాగన్ లో ఎన్టీఆర్ ఒరిజినల్ హేయిర్ తో కనిపించడని తెలుస్తోంది. కాబట్టి ఒకేసారి రెండు సినిమాలు ప్యార్ లల్ గా తెరకెక్కినా గెటప్ ప్రాబ్లమ్స్ ఏమి రావు..

ఏదేమైన దేవర2 లో అసలైన కథ ఉంది… ఐతే దేవర పాత్ర తాలూకుడు షూటింగ్ 20 రోజులు పూర్తి చేస్తే ఇక , దేవర 2 లో ఆ పాత్రతో అవసరం ఉండదని, అందుకే ఆ పాత్ర తాలూకు సీన్లని జనవరిలో తెరకెక్కించి, ఏప్రిల్ నుంచి డ్రాగన్, దేవర 2 రెండీంటినీ ప్యార్ లల్ గా తీయాలని నిర్ణయించారట. ఈవిషయంలో ప్రశాంత్ నీల్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొరటాల తో సీక్వెల్ చేసేలా పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు ఎన్టీఆర్.