DIL RAJU: సంక్రాంతి సినిమాలకు దిల్ రాజు ఆఫర్.. ఇంతకీ ఏం చెప్పారంటే..

ఏ సినిమాని వాయిదా చేసుకోమని తాము మాత్రం చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికైనా సాధ్యాసాధ్యాల గురించి మాత్రమే చెప్పామన్నారు. ఒక నిర్మాతకు తన పెట్టుబడి, దానిని రికవర్ చేసుకునేందుకు కొన్ని అంచనాలు ఉంటాయని.. వాటికి అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటారన్నారు దిల్ రాజు.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 04:44 PM IST

DIL RAJU: ప్రతి సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ కామన్. ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా గట్టి పోటినే నెలకొంది. సంక్రాంతి బరిలో 2 లేదా 3 సినిమాలు పోటీ పడేవి. అయితే ఈ పొంగల్ పోరు టాలీవుడ్ నుంచి ఐదు సినిమాలు.. పరభాష చిత్రాలు మూడు బరిలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అన్ని మూవీస్‌కి థియేటర్స్ సర్దుబాటు చేయాలంటే కష్టమవుతుంది. దీంతో ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలతో సమావేశం జరగ్గా.. చర్చలు విఫలమయ్యాయి. దీంతో మరోసారి దిల్ రాజు సారథ్యంలో చర్చలు జరిగాయి.

Jr NTR: ఫ్యామిలీ టైం.. హఠాత్తుగా జపాన్‌కు ఎన్టీఆర్

ఈ సందర్భంగా మేకర్స్‌కు పలు సూచనలు ఇచ్చాడు దిల్ రాజు. సంక్రాంతి పోరు నుంచి ఒక మూడు సినిమాలు అయినా వెనక్కి వెళ్తే అందరికి మంచిందని.. ఇటీవల దిల్ రాజు నాయకత్వంలో జరిగిన ఒక మీటింగ్‌లో నిర్ణయించారు. ఇక ఈ నిర్ణయంపై ముందడుగు దిల్ రాజే తీసుకుంటూ.. తను నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ని సమ్మర్‌కి వాయిదా వేసినట్లు తెలిపాడు. ఇక మిగిలిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’ అందరికంటే ముందుగా డేట్‌ని ప్రకటించింది కాబట్టి ఆ సినిమా వాయిదా చేయడం అనేది జరగదు అని తేల్చి చెప్పేసారు. ఏ సినిమాని వాయిదా చేసుకోమని తాము మాత్రం చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికైనా సాధ్యాసాధ్యాల గురించి మాత్రమే చెప్పామన్నారు. ఒక నిర్మాతకు తన పెట్టుబడి, దానిని రికవర్ చేసుకునేందుకు కొన్ని అంచనాలు ఉంటాయని.. వాటికి అనుగుణంగా వాళ్లు నిర్ణయం తీసుకుంటారన్నారు దిల్ రాజు.

తాను మాత్రం ఎవరికైనా సలహా మాత్రమే ఇచ్చానని.. వాయిదా నిర్ణయం పూర్తిగా వారికే వదిలేశామన్నారు. ఇప్పుడు రేసు నుంచి తప్పుకునే నిర్మాతలకు సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. వారి మూవీ రిలీజ్ ఉన్న సమయంలో ఏ చిత్రాలు పోటీకి రాకుండా ఉండేలా చూస్తామన్నారు. ఎవరు తగ్గినా మిగిలిన వారికి ధియేటర్లు దొరుకుతాయి. ఎవరూ తగ్గకపోతే అన్ని సినిమాలు విడుదలవుతాయి. కాకపోతే.. అన్ని సినిమాలకూ న్యాయం జరగదన్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించనున్నట్లు తెలిపారు.