Dil Raju : దిల్‌ రాజు రొమాంటిక్ ఫొటోషూట్‌.. నువ్‌ హీరో మెటీరియల్‌ సార్‌..

దిల్ రాజు (Dil Raju) కాదు.. సక్సెస్‌ రాజు అనిపించుకున్నారు ఆ మధ్య దిల్ రాజు. ఆ లెవల్‌ విజయాలు చూశారు.. నిర్మాతగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆయన.. ఓవరాల్‌గా మంచి సక్సెస్ రేటు సంపాదించుకున్నారు.

దిల్ రాజు (Dil Raju) కాదు.. సక్సెస్‌ రాజు అనిపించుకున్నారు ఆ మధ్య దిల్ రాజు. ఆ లెవల్‌ విజయాలు చూశారు.. నిర్మాతగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆయన.. ఓవరాల్‌గా మంచి సక్సెస్ రేటు సంపాదించుకున్నారు. ఐతే ఈ మధ్య.. దిల్ రాజు టైమ్ అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. తీసిన సినిమాలన్నీ.. బాక్సాఫీస్ దగ్గర వరుస పెట్టి బోల్తా కొడుతున్నాయ్. విజయ్ దేవరకొండతో తీసిన ది ఫ్యామిలీ స్టార్ (The Family Star), తర్వాత ఆశిష్‌ (Ashisha) తో తీసిన లవ్ మీ… రెండు సినిమాలు కూడా సోసోగానే మిగిలిపోయాయ్.

ఇవేం స్టోరీలు అంటూ దిల్ రాజును ఫ్యాన్స్‌ గట్టిగానే ట్రోల్ చేశారు. వరుస ఫ్లాప్‌ల మధ్య బ్రేక్ తీసుకుందాం అనుకున్నారో.. ఫ్యామిలీతో కాస్త క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో కానీ.. కుటుంబంతో కలిసి అలా అమెరికా వెళ్లొచ్చారు దిల్ రాజు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న దిల్ రాజు.. భార్య తేజస్వినితో కలిసి తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయ్. దిల్ రాజు లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. డెనిమ్ షాట్, డెనిమ్ జాకెట్‌లో దిల్ రాజు కనిపిస్తుండగా.. ఆయన భార్య వైట్ కలర్ డ్రెస్‌లో ఉంది.

వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. కొన్ని ఫోటోల్లో దిల్ రాజు ఫోన్ మాట్లాడుతుండగా.. కొన్ని ఫోటోల్లో మాత్రం.. కళ్లలోకి కళ్లు పెట్టి ఇద్దరు చూసుకుంటున్నట్లు కనిపించింది. ఈ ఫొటోల మీద ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందని కొందరు అంటుంటే.. నువ్ అర్జంట్‌గా హీరోగా ట్రై చెయ్ మావా అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా ఫొటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయ్.