Game Changer : గేమ్ చేంజ‌ర్ అపేడేట్ ఇచ్చిన దిల్‌రాజు

గ్లోబ‌ల్ స్టార్ (Global Star) రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) -లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వ‌స్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'గేమ్ చేంజర్స .. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన త‌ర్వాత చెర్రీ నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతో.. దీనిపై భారీ అంచ‌నాలున్నాయి.

గ్లోబ‌ల్ స్టార్ (Global Star) రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) -లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వ‌స్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘గేమ్ చేంజర్స .. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన త‌ర్వాత చెర్రీ నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతో.. దీనిపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే.. గేమ్ చేంజర్ (Game Changer) నుంచి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదని అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్పుడెప్పుడో జరగండి జరగండి అనే పాటను రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ పాట ఎప్పుడో లీక్ అయిపోయింది. దీంతో.. ఆ పాట‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ మ‌ళ్లీ ఆ ఊసే ఎత్త‌లేదు. దీంతో ఫుల్ డిజ‌ప్పాయింట్‌మెంట్‌లో ఉన్న ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా దిల్ రాజు ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.

ఈ చిత్రం నుండి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి, ఫ్యాన్స్ కి దిల్ రాజు ఫైన‌ల్లీ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. లవ్ మీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ ను అందించారు. మన రామ్ చరణ్ గారి బర్త్ డే ఉంది కదా ఈ మంత్, సో ఆ రోజు మీకోసం గేమ్ చేంజర్ నుండి కాంటెంట్ రాబోతుంది అంటూ అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు స్వీట్ షాక్ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ సంద‌డి చేస్తున్నారు. చెర్రీ బర్త్‌డే రోజున త‌మ‌కు రెండు పండుగ‌లు అంటూ సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. వి ఆర్ వెయిటింగ్ అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.

కాగా.. రామ్ చ‌రణ్ చాలా రోజులుగా ఈ మూవీపైనే ఫిక్స‌యిపోయి ఉన్నాడు. అటు.. ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దసరాకు అటూ ఇటూ ఈ సినిమా వస్తుందని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ మూవీని పూర్తి చేసి బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లోకి వెళ్లాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. ఆర్‌సీ 16గా రాబోతున్న ఈ మూవీపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలున్నాయి. కాగా.. గేమ్ చేంజర్ పాటల కోసం శంకర్ ప్రత్యేక శ్రద్ద పెట్టాడని సమాచారం. ఒక్కో పాట కోసమే పదుల కోట్లు ఖర్చు పెట్టాడని టాక్. ఇక తమన్ సైతం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలానే పాటలు, ఆర్ఆర్‌ను రెడీ చేశాడని అంటున్నారు. చూడాలి మ‌రి.. భారీ సినిమాల డైరెక్టర్ శంక‌ర్ చెర్రీకి ఎలాంటి బ్లాస్టింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందిస్తాడో..