ఇంత ధైర్యం ఏంటి.. ఓ డీసీపీ స్థాయి వ్యక్తిని సింగిల్‌గా ఢీకొడుతోంది అంటే.. డింపుల్ వెనక ఉంది ఎవరు.. ఎవరిని చూసుకొని ఈ అమ్మడు ఇంతలా చెలరేగిపోతుందనే చర్చ సాగుతోంది. నిజానికి పోలీసులు అంటేనే.. ఎందుకొచ్చిన గోల వాళ్లతో అని అంతా పక్కకు వెళ్తారు. అలాంటి ఐపీఎస్ అయితే చెప్పాల్సిన పనేలేదు ప్రత్యేకంగా. ఐతే అలాంటి ఐపీఎస్ ఆఫీసర్‌తోనే పెట్టుకుంది డింపుల్ హయతి. ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డేతో వివాదం పోలీస్ స్టేషన్, కేసుల వరకు వెళ్లటంతో.. ఇంతకీ ఎవరీ డింపుల్ హయాతి.. సినీ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ ఏంటీ.. ఏయే సినిమాల్లో నటించింది అనేది ఆసక్తిగా మారింది.
విజయవాడలో పుట్టిన డింపుల్.. హైదరాబాద్‌లో పెరిగింది. డింపుల్ హయతి అసలు పేరు డింపుల్ మాత్రమే. న్యూమరాలజీ సెంటిమెంట్‌తో చివర హాయతి అని తగిలించుకుంది. 2017లో 19ఏళ్ల వయస్సులోనే సిల్వర్ స్క్రీన్ మీద మెరిసింది. గల్ఫ్ అనే సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో యురేక సినిమాలో నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో.. జర్ర జర్ర అనే ఐటమ్ సాంగ్‌లో కనిపించింది డింపుల్. ఈ పాట ఆమెకు మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడి చిత్రంలో నటించిన డింపుల్ హయాతి.. ఈ మధ్యే గోపీంచంద్ హీరోగా వచ్చిన రామాబాణం చిత్రంలోనూ ఫీమేల్ లీడ్‌గా యాక్ట్ చేసింది.