Adipurush: కాలర్ ఎగరేసేలా చేసిన ఆదిపురుష్.. కాని అక్కడ మాత్రం డిసప్పాయింట్..?

ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్స్ లో రిలీజైంది ఆదిపురుష్. రిలీజ్ కిముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 250 కోట్లు, నార్త్ లో థియేట్రికల్ రైట్స్ రూపంలో 350 కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ థియేటర్స్ లో హనుమంతుడికోసం థియేటర్స్ లో ఖాలీగా వేయిట్ చేసే కుర్చీ, థియేటర్స్ లో సందడి చేసిన వానరం.. ఇలా నెట్ లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హంగామానే.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 02:06 PM IST

ఇక ఆదిపురుష్ టాక్ అంచనాలను అందుకుంది. ఉత్తర భారత దేశం లో అయితే పూనకాలే కనిపిస్తున్నాయి. చెప్పులు లేకుండా థియేటర్స్ లోకి వచ్చే ఆడియన్స్ తో ఇదో ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఇక కథ విషయానికొస్తే, అందరికి తెలిసిన పురాణ గాదే,… రామాయణం ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు తెరకెక్కించాడు ఓం రౌత్.

ఆదిపురుష్ లో రాముడిగా పాత్రలో పాతుకుపోయిన ప్రభాస్, సీతగా కదిలించిన క్రుతి సనన్, హనుమంతుడిగా రోమాలు నిక్కబోడిచేలా చేసిన దేవదత్త, ఇక పది తలల్లో విలనిజాన్ని పండించిన సైఫ్.. ఈ నలుగురు నాలుగు స్థంబాలైతే, అజయ్ అతుల్ పాటలు పదేళ్లైన మర్చిపోలేనంత ఫీల్ తో ఆకట్టుకుంటన్నాయి.

ఇదంతా నార్త్ ఇండియా వర్షన్. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో జనాల రెస్పాన్స్.. కాని కేరళ, తమిళ నాడులో అసలు ఆదిపురుష్ కి హిట్ టాక్ కాదుకాని, యావరేజ్ టాక్ కూడా రావట్లేదు. ఓవర్ సీస్ లో బాహుబలిని మించే మూవీ అనేంత హైప్ కి తగ్గ రెస్పాన్స్ వస్తోంది. ఇలా చూస్తే కేరళా, తమిళ నాడుని వదిలేస్తే ఆదిపురుష్ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అనుకోవాల్సిందే.. ఎటొచ్చి, ఊహించినట్టే కేరళా, తమిళ నాడులో ఆదిపురుష్ ప్రభావం కనిపించట్లేదు.