ATLEE: 200 కోట్ల ప్యాకేజ్‌తో షాక్ ఇస్తున్న డైరెక్టర్ అట్లీ..?

ఇప్పుడు అట్లీతో సినిమా తీయాలంటే అచ్చంగా రూ.200 కోట్లు తనకి నిర్మాతలు సమర్పించుకోవాలి. అందులో రూ.120 కోట్లు తన రెమ్యునరేషన్, మిగతా 80 కోట్లు, హీరోయిన్లు, టెక్నీషియన్ పారితోషికమట. హీరో రెమ్యునరేషన్, మేకింగ్ మాత్రం నిర్మాతే చూసుకోవాలి.

  • Written By:
  • Publish Date - October 10, 2023 / 05:46 PM IST

ATLEE: దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 1 తీసి రూ.600 కోట్లు రాబట్టాడు. పార్ట్ 2తో రూ.1800 కోట్లు కొల్లగొట్టాడు. లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఆర్‌తో రూ.1200 కోట్ల వసూళ్లకి రారాజు అయ్యాడు. అలాంటి దర్శకుడి రెమ్యునరేషన్‌ని మించిపోయింది తమిళ్ డైరెక్టర్ అట్లీ పారితోషికం. ఇప్పుడు అట్లీతో సినిమా తీయాలంటే అచ్చంగా రూ.200 కోట్లు తనకి నిర్మాతలు సమర్పించుకోవాలి. అందులో రూ.120 కోట్లు తన రెమ్యునరేషన్, మిగతా 80 కోట్లు, హీరోయిన్లు, టెక్నీషియన్ పారితోషికమట.

హీరో రెమ్యునరేషన్, మేకింగ్ మాత్రం నిర్మాతే చూసుకోవాలి. అంటే ఓ డైరెక్టర్‌గా ఆట్లీ ఏ మూవీ తీసినా, హీరో, తప్ప మిగతా స్టార్స్, టెక్నీషియన్స్ తను అనుకున్న వాళ్లనే తీసుకునేందుకు ఇది స్ట్రాటజీ అని తెలుస్తోంది. సరే ఆట్లీ స్ట్రాటజీ ఏదైనా కానీ.. తన పారితోషికం జవాన్‌కి రూ.200 కోట్ల ప్యాకేజ్ తీసుకున్నాడు. అందులో తన వాటా రూ.120 కోట్లు. అంటే రాజమౌళికంటే రెండు రెట్లు అధికం. త్రిబుల్ఆర్, బాహుబలికి రూ.50, రూ.75 కోట్ల చొప్పునే తీసుకున్నాడు జక్కన్న. ఇన్నేళ్లు ఇన్ని బ్లాక్ బస్టర్లు తీసిన రాజమౌళి మొత్తం ఆస్తి విలువే రూ.158 కోట్లని తెలుస్తోంది.

అంటే తన యావదాస్తిని డైరెక్టర్ ఆట్లీ కేవలం జవాన్ మూవీ ప్యాకేజ్‌తోనే సంపాదించినట్టు. అంతేకాదు రూ.1100 కోట్లు రాబట్టిన ఆ ప్రాజెక్ట్‌తో వెయ్యికోట్ల దర్శకుడిగా కూడా రాజమౌైళిని రీచ్ అయ్యాడు. సింగిల్ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు అట్లీ.