Prabhas: రాజా డీలక్స్ కాదు.. రెబల్ రాజా.. !

యంగ్ రెబల్ స్టార్ తో మారుతి తీసేమూవీ రాజా డీలక్స్ అంటూ ఇంతకాలం ప్రచారంజరిగింది. కాని రెబల్ రాజా నే అసలు టైటిల్ అని కొత్తగా ప్రచారం పెరుగుతోంది. నిజానికి మారుతి ఇప్పుడు ప్రభాస్ మూవీ కోసం ముచ్చటగా 3 టైటిల్లు సిద్దం చేశాడు..

  • Written By:
  • Publish Date - April 13, 2023 / 06:15 PM IST

అందులో ఒకటి రెబల్ రాజా.. ఇక మిగతా టైటిల్స్ విషయానికొస్తే రెబల్ టాకీస్, రెబల్ మహావీర్.. ఈ టైటిల్లవెనక ఓ భారీ కథే ఉంది.. ఓ థియేటర్ చుట్టూ జరిగే ఓ హర్రర్ కామెడీ యాక్షన్ డ్రామానే ఈమూవీ. ఐతే వాటినే టైటిల్స్ అనుకోవటానకి ప్రత్యేకమైన కారణం ఉంది.

యంగ్ రెబల్ స్టార్ బిరుదుని వాడటం, అలానే తన పెద్దనాన్న రెబల్ స్టార్ అవటంతో తన పేరుతో ఈమూవీలో తాత పాత్ర ఉండటం.. కారణంతో టైటిల్ లో రెబల్ ఉండేలా ప్లాన్ చేశాడట మారుతి. ఇక రెబల్ రాజా, రెబల్ టాకీస్, రెబల్ మహా వీర్ లో ఈ మూడు పేల్లకు కారణం, సినిమాలోహీరోపేరు రాజా, ఇక టాకీస్ పేరుమహావీర్ అవటంతో ఈ పేర్లను టైటిల్లో ఉండేలా ప్లాన్ చేశాడట మారుతి.. ఇది ప్రభాస్ కొత్త మూవీ 3 సినిమా టైటిల్స్ వెనకున్న కథ అంటూ జరుగుతున్న ప్రచారం.