ఐతే అసలు మూవీ పూర్తై, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడే టోటల్ టీంకి ఎలాంటి హోప్ లేదట. అందుకే తిరుపతి ప్రమోషన్ తప్ప మరెక్కడా ఆ హడావిడి చేయలేదు. ఆవిషయంలో ఓం రౌత్ మీద ప్రభాస్ కి కోపం ఉన్నా ఏమనలేదని తెలుస్తోంది. సరే క్వాలిటీ బాలేదని ఊరుకుందామంటే ప్రభాస్ కి డ్యామేజ్ మరో రూపంలో జరుగుతోంది. హానుమంతుని డైలాగ్స్, రావణుడి డైలాగ్స్ తోపాటు రావణుడితో సీత చెప్పే మాటలు కూడా వివాదం అయ్యాయి. అయోధ్య రామ మందిర పూజారైతే ఈ సినిమాని బ్యాన్ చేయాలన్నాడు. హనుమాన్ టెంపుల్ పూజారి తోపాటు ఓల్డ్ రామాయణంలో లక్షణుడి పాత్ర వేసిన వ్యక్తి మండి పడ్డాడు..
ఇన్ని విమర్శలు వస్తుండటంతో 25 డైలాగ్స్ ని తీసేసి, వాటి ప్లేస్ లో మరో డైలాగ్స్ ని యాడ్ చేయటమో, లేదంటే పూర్తిగా ఆడైలాగ్స్ ఉన్న సీన్స్ తీసేయటమో చేయబోతోందిఫిల్మ్ టీం. ఇక రచయిత మనోజ్ ఇప్పటికే డైలాగ్స్ తీసేసి, లేదంటే మార్చేసి కొత్త ప్రింట్ ని వారంలోపు అందుబాటులో పెడటామన్నాడు. అంటే ఈ ఫ్రైడే కి ఆదిపురుష్ మళ్లీ రిలీజ్ అవుతుందని అర్ధమౌతోంది.. టీజర్ ని రిలీజ్ చేసినప్పుడే సినిమా పరిస్థితి అందరికి అర్ధమైంది. ఇప్పుడు టీజర్ ని రిపేర్లు చేసి రీరిలీజ్ చేసినట్టే, సినిమాను రిపేర్లు చేసి మళ్లీ రిలీజ్ చేస్తా అనటంతో ఆరకంగా కూడా ట్రోలింగ్ పెరిగింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద తలనొప్పౌతోంది.