Director: ప్రశాంత్‌ నీల్ కొత్త సాహసం.. కేరక్టర్ యాక్టర్‌ కోసం ఇంత సాహసమా ?

ప్రశాంత్ నీల్.. పేరు చెప్తే విజువల్‌ కూడా బొగ్గు పూసేసుకుంటుందనే జోక్ వినిపిస్తుంటుంది అభిమానుల్లో ! నమ్మి కష్టపడితే.. అనుకున్నది తీస్తే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది.. రిజల్ట్ రేంజ్‌ ఏంటో కేజీఎఫ్‌తో అందరికీ పరిచయం చేశాడు నీల్‌. కేజీఎఫ్ ఫ్రాంచైజీతో నేషనల్‌వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 03:14 PM IST

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన స్టిల్స్‌.. మూవీ మీద అంచనాలు పెంచేశాయ్. దీని తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీస్‌ అన్నీ హొంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌లోనే తెరకెక్కనున్నాయ్. ఈ రెండింటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా పనిచేస్తున్నాడు ప్రశాంత్‌ నీల్‌. తన అసిస్టెంట్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. కేరక్టర్ ఆర్టిస్ట్ ఆదర్శ్‌ బాలకృష్ణను లీడ్‌ రోల్‌గా మూవీ తెరకెక్కిస్తున్నాడు నీల్. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే అతనే అందిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా హొంబలే ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచే వస్తోంది.

హీరోయిన్‌ సెంట్రిక్‌గా తెరకక్కే ఈ సినిమాకు.. దీపికా పదుకునేను విమెన్‌ లీడ్‌గా అనుకుంటున్నారు. మూవీకి సంబంధించి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఇప్పటికే ఓ షెడ్యూల్‌ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. హీరోయిన్ ఎవరన్నది ఫైనల్ అయిన తర్వాత సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. ఆదర్శ్‌ బాలకృష్ణలాంటి యాక్టర్‌ను మేల్‌ లీడ్‌గా తీసుకొని.. హీరోయిన్ సెంట్రిక్‌గా ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయడం అంటే.. ప్రశాంత్ నీల్‌ సాహసం చేస్తున్నాడనే చర్చ జరుగుతోంది. ఐతే ప్రశాంత్ నీల్‌కు ఆదర్శ్‌ బాలకృష్ణ బంధువు అవుతాడు. నీల్‌ చిన్నాన్న కొడుకే ఆదర్శ్‌ బాలకృష్ణ. ఆదర్శ్ తండ్రి కూడా కేజీఎఫ్‌లో యాక్ట్ చేశాడు.