Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ చెప్పేసిన సందీప్ వంగా

ప్రస్తుతం ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల లైనప్ చూస్తుంటే.. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వస్తోంది. ‘బాహుబలి’లాంటి ప్యాన్ వరల్డ్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గానే నిలిచాయి. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 02:29 PM IST

Prabhas: ఎన్నిసినిమాలు తీశాం అన్నది కాదు.. బాక్సాఫీస్hని షేక్ చేశామా లేదా అనేదే ఇంపార్టెంట్. అదెలా ఉంటుందో ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసి చూపించాడు సందీప్ వంగా. అర్జున్ రెడ్డి అనే సింగిల్ మూవీతో ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ సేమ్ మూవీ రీమేక్ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో దుమ్ములేపాడు. ప్రస్తుతం యానిమల్ మూవీ జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేసిన యానిమల్ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, హై వోల్టేజ్ ఇంటెన్స్ యాక్షన్ గానీ, రష్మికతో లవ్ సీన్లలో గానీ రణబీర్ కపూర్ జీవించాడట. సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన ఫిల్మ్ మేకింగ్ స్టైల్, దర్శకత్వం ఎలా ఉంటుందో చూపించాడనే పాజిటివ్ టాక్ వచ్చింది.

SALAAR-KGF: నీల్ యూనివర్స్ కన్ఫామ్​.. ‘కేజీఎఫ్‌2’తో ‘సలార్‌’ను ముడిపెట్టిన ప్రశాంత్‌నీల్‌..

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్న డైరెక్టర్ సందీప్ వంగా ఈ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తో తెరకెక్కబోయే స్పిరిట్‌కి సంబంధించి సూపర్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ అప్‌కమింగ్ సినిమాల లైనప్ చూస్తుంటే.. ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వస్తోంది. ‘బాహుబలి’లాంటి ప్యాన్ వరల్డ్ హిట్ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గానే నిలిచాయి. దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. ప్రశాంత్ నీల్‌లాంటి కమర్షియల్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు కాబట్టి ‘సలార్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ విడుదల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ పైనా ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా డీలక్స్’పై అంతగా అంచనాలు లేకపోయినా సమ్ థింగ్ స్పెషల్ అని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. ఈ మూడు సినిమాల హడావుడి పూర్తయ్యాక సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సెట్స్‌లోకి అడుగుపెడతాడు ప్రభాస్. ప్రభాస్ కెరీర్‌లోనే 25వ సినిమా ఇది.

అందుకే ఈ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడట సందీప్. సాధారణంగా సందీప్ తెరకెక్కించే ప్రతీ సినిమాలో వైలెన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ విషయంలో ‘స్పిరిట్’లో కూడా తగ్గేదేలే అంటున్నాడు సందీప్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్. ‘యానిమల్’ ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి త్వరలోనే స్పిరిట్ ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తాడట దర్శకుడు. అంతే కాకుండా 2025 క్రిస్మస్‌ లేదా 2026 సంక్రాంతికి రీలీజ్ పక్కా అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఫుల్ జోష్ నింపే న్యూసే ఇది.