Game Changer: గేమ్ ఛేంజర్‌ పరిస్థితి ఏంటి..? శంకర్ భారతీయుడు 2పైనే ఫోకస్ చేశాడా..?

భారతీయుడు 2.. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్స్‌ ఒకదాని తర్వాత మరోటి జరుగుతున్నా.. శంకర్‌ మాత్రం కమల్‌ సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అప్పటికే కొంతపార్ట్‌ షూటింగ్‌ పూర్తికావడంతో.. మిగతాది కూడా ఫినిష్‌ చేసి.. డబ్బింగ్‌ మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 07:17 PM IST

Game Changer: దర్శకుడు శంకర్‌ భారతీయుడు2ను మాత్రమే పట్టించుకుని రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ను గాలికి వదిలేశాడా..? ఇదే నిజమనుకుంటే.. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌‌కు గ్యాప్‌ వచ్చినా అప్పుడప్పుడూ షూటింగ్ జరుగుతూనే వుంది. అయితే.. అప్‌డేట్‌ మాత్రం ఇవ్వడం లేదు? ఏం జరుగుతుందో తెలీని పరిస్థితిలో గేమ్‌ ఛేంజర్‌ వుందా..? భారతీయుడు2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంతో సినిమా ఆగిపోయింది. అప్పటికే ఖర్చు ఎక్కువ కావడంతో.. నిర్మాత, దర్శకుడు శంకర్‌ మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.

సినిమా అటకెక్కడంతో.. శంకర్‌ రామ్‌చరణ్‌తో గేమ్‌ఛేంజర్‌ స్టార్ట్ చేశాడు. కొత్త సినిమా షూటింగ్‌ నాన్‌ స్టాప్‌గా జరుగుతోంది. శంకర్‌ స్టైల్‌కు భిన్నంగా అనుకున్న టైంలో షూటింగ్‌ నడుస్తుంటే.. భారతీయుడు2 మళ్లీ సెట్స్‌పైకి రావడంతో గేమ్‌ ఛేంజర్‌ ట్రాక్‌ తప్పింది. భారతీయుడు 2.. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్స్‌ ఒకదాని తర్వాత మరోటి జరుగుతున్నా.. శంకర్‌ మాత్రం కమల్‌ సినిమాకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అప్పటికే కొంతపార్ట్‌ షూటింగ్‌ పూర్తికావడంతో.. మిగతాది కూడా ఫినిష్‌ చేసి.. డబ్బింగ్‌ మొదలుపెట్టారు. రీసెంట్‌గా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుకాగా.. వీడియో రిలీజ్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ చాలా బ్యాలెన్స్‌ వుండడంతో.. భారతీయుడు2 ముందుగా రిలీజ్‌ చేస్తున్నారు. అయితే విడుదల తేదీ మాత్రం ఎనౌన్స్‌ చేయలేదు. సమ్మర్‌కు రావడం అయితే పక్కా.

గేమ్‌ ఛేంజర్‌ను ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేద్దామనుకుంటే.. ముందుగా ఈ డేట్‌పై పుష్ప2 కర్చీఫ్‌ వేసింది. దీంతో గేమ్‌ ఛేంజర్‌ టీం డైలమాలో పడింది. రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ ఒకేసారి రాలేవు. గేమ్‌ ఛేంజర్‌ టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ తర్వాత మేకర్స్‌ ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ లుక్‌ ఒక్కటే బైటపెట్టారు. గ్లిమ్స్‌ కూడా రిలీజ్‌ చేయకుండా.. సీక్రెసీ మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ తర్వాత సంగతి. ముందు ఏదో ఒక వీడియో రిలీజ్‌ చేస్తే .. గుర్రుగా వున్న ఫ్యాన్స్‌ శాటిస్‌ఫై అవుతారు.