పెద్ద సినిమాలు నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ మీద గతంలో ఒకసారి ఐటీ రైడ్, మొన్న ఒకసారి ఐటీ రైడ్ జరిగింది. ఈ సారి టాప్ స్టార్స్ కి ఎవరికి ఎంత అడ్వాన్స్ లు ఇచ్చింది, ఏ హీరోకి ఎంత బ్లాక్ మని వెల్లింది మొత్తం మైత్రీ మూవీ మేకర్స్ లిస్ట్ ఉండటం, ఆ వాట్స్ ఆప్ చాట్ ఐటీ శాఖకు దొరకటం తో నిర్మాతలకి నిద్రపట్టట్లేదట. ఒకటి తాము ఇరుక్కోవటం, మరొకటి తమ వల్ల హీరోలు ఇరుక్కునే పరిస్థితి వస్తే, టాలీవుడ్ లో ఇక మైత్రీ చాప్టర్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉండటం.
ఇక ఈ మొత్తం వ్యహరానానికి అసలు కారనం సుకుమార్ అంటున్నారు. తన శిష్యులు తీసే సినిమాలకలో సుకుమార్ కు కూడా వాటా ఉండటం, వరుసగా తన శిష్యుల సినిమాలు వసూళ్ల వర్షం కురిపించటంతో ఐటీ శాఖ సుక్కు మీద ఓ కన్నేసిందట. ఆ ప్రాసెస్ లోనే మైత్రీ మూవీ మేకర్స్ మీద కూడా ఐటీ రైడ్ జరిగిందట. ఐతే మైత్రీ టీం ప్రభాస్ కి ఇచ్చిన అడ్వాన్స్ 70 కోట్లని, వాటికి లెక్కలు లేవని, మొత్తం ఇష్యూలో ప్రభాస్ కి ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా, పరోక్షంగా ఇరుక్కునే పరిస్థితులొస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.