సినిమా ఫ్లాప్ అయితే ఆ నాలుగు రోజులు చెప్పుకుని మర్చిపోతారు. గతంలోని హిట్స్ చూసి ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారు. సైరా తర్వాత సురేంద్రరెడ్డికి ఏజెంట్ ఆఫర్ ఇలాగే వచ్చింది. మేకోవర్ అంటూ.. రెండేళ్లపాటు అఖిల్‌ను కష్టపెట్టి.. చివరికి జీరో రిజల్ట్ ఇచ్చాడు. తప్పంతా నాదే.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఏజెంట్ తీశామని^నిర్మాత అనిల్ సుంకర ఓపెన్ లెటర్‌లో పేర్కొన్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎలా తీశావని నెటిజన్లు నిర్మాతను ప్రశ్నించినా.. ఇన్‌డైరెక్ట్‌గా ఇది దర్శకుడికే తగిలింది.
ఏజెంట్ ఫ్లాప్‌ను నిర్మాత తనపై వేసుకున్నా.. నెటిజన్లు.. అక్కినేని అభిమానులు మాత్రం.. సురేంద్రరెడ్డిదే తప్పంటున్నారు. అఖిల్ దొరికాడు.. నిర్మాత దొరికాడని సినిమా తీసేశావా? అంటూ అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీనికి తోడు 50 పర్సెంట్ రీషూట్ చేసి సినిమా బడ్జెట్‌ను 80 కోట్లకు పెంచేశాడు దర్శకుడు. సినిమాను డెఫ్‌షీట్‌తో రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్ థియేటరికల్ రైట్స్‌ను 36 కోట్లకు అమ్మితే.. 6 కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా ఏజెంట్ 30 కోట్ల హ్యూజ్ డిజాస్టర్‌గా హీరో.. దర్శకుడు.. నిర్మాత కెరీర్‌లో మాయని మచ్చగా నిలిచిపోయింది.
ఏజెంట్ ఫ్లాప్ తర్వాత అఖిల్ ను నిలబెట్టడానికి నాగార్జున ఏదో ఒకటి చేసి.. మరో సినిమా తీసే ప్రయత్నం చేస్తాడు. కానీ.. సురేంద్రరెడ్డికి ఎవరు ఛాన్స్ ఇస్తారు? గతంలో బన్నీకి రేసుగుర్రం… రామ్‌చరణ్‌కు ధృవతో హిట్స్ ఇచ్చినా.. వీరిద్దరితో మంచి అనుబంధం వున్నా.. ఆఫర్స్ ఇచ్చే పొజిషన్‌లో లేరు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా.. ఏజెంట్ చూసి ఇస్తారా? బన్నీ పుష్ప2తో ఇంకో ఏడాది వరకు బిజీ. ఆతర్వాత త్రివిక్రమ్.. సందీప్ వంగా సినిమాలు లైన్లో వున్నాయి.
ధృవ సినిమాతో సురేంద్రరెడ్డి రామ్‌చరణ్‌కు బాగా దగ్గరయ్యాడు. డైరెక్టర్ వర్క్ నచ్చి… చెర్రీనే ఏరికోరి సైరా ఛాన్స్ ఇచ్చాడు. సురేంద్రరెడ్డితో ధృవ2 తీయాలన్న ఆలోచన చెర్రీకి వున్నా.. ఇప్పట్లో వర్కవుట్ కాదు. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ తర్వాత…బుచ్చిబాబు రెడీగా వున్నాడు. సైరా తర్వాత స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో… అఖిల్ దొరకడంతో ఏజెంట్ తీశాడు. అలాగే.. సురేంద్రరెడ్డి ఏ హీరోను పడతాడో చూడాలి మరి. లేదంటే శ్రీను వైట్ల లా ఇండస్ట్రీ లో మిగిలిపోయిన ఆశ్చర్యం లేదు