ఎప్పుడో 1948లో మన దేశంలో అంతరించిపోయిన చీతాలను ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి ప్రత్యేక విమానాల్లో మన దేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చీతాలు మాత్రం వరుసగా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు 12 చీతాలను తీసుకొస్తే అందులో 8 ప్రాణాలు కోల్పోయి అధికారులను కంగారు పెడుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లో చీతాలను అధికారులు వదిలేస్తున్నారు. 10 ఏళ్ళ పాటు ప్రతీ ఏటా 12 చీతాలను భారత్ కు నమీబియా నుంచి తీసుకొస్తారు.
ఇవి భారత్ లోని వాతావరణానికి అలవాటు పడకపోవడంతో ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. వారం క్రితం ఒక చీతా నీటిలో మునిగి చనిపోయిందని అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఈ చీతాలపై ఒక వెబ్ సీరీస్ రానుంది. షోకేస్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది కంట్రీ టూ ది వరల్డ్” పేరుతో నాలుగు భాగాలుగా ఒక వెబ్ సీరీస్ ను ప్లాన్ చేసింది డిస్కవరీ ఛానల్. ఈ వెబ్ సీరీస్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ చీతాలు పడుతున్న ఇబ్బందులను ఈ వెబ్ సీరీస్ లో డిస్కవరీ ఛానల్ చూపిస్తుంది. 170 దేశాల్లో ఈ సీరీస్ ప్రసారం అవుతుంది. కాగా 12 చీతాలను తీసుకురాగ వాటికి పుట్టిన 17 కూనల్లో 12 బ్రతికి ఉన్నాయి.