యానిమల్ మూవీకి తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో భారీగా డిమాండ్ ఉండటం అందర్ని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అంతటికీ కారణం అర్జున్ రెడ్డి అంటున్నారు. విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి ఎఫెక్టే యానిమల్ మీద పడింది. కారణం గతంలో అర్జున్ రెడ్డి తమిళ్ డబ్బింగ్ రైట్స్ తీసుకని మళ్లీ వద్దనుకున్న బ్యాచ్, అప్పుడు ఎంత నష్టపోయారో తెలుసుకున్నారు. ఈ సినిమా తమిల్, మలయాల్, కన్నడే కాదు హిందీజనాలకు కూడా భాషలకు అతీతంగా నచ్చింది
అలాంటి సినిమా తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగనే, యానిమల్ తీస్తున్నాడంటే ఇది మరో సెన్సేషన్ క్రియేట్ చేయటం కన్పామ్. ఆల్రెడీ అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా తీసి 300 కోట్లు వసూళ్లు రాబట్టాడు సందీప్. అందుకే తను యానిమల్ ని మనముందుకు తీసుకొస్తున్నాడటే ఇది అంతకుమించి దుమ్ముదులిపే ఛాన్స్ ఉంది.
ఓ డాక్టర్ లవ్వే అంత వయోలెంట్ గా ఉంటే, ఓ యానిమల్ తన ప్రేమ కోసం ఫైట్ చేస్తే ఎంత వయోలెంట్ గా ఉంటుందో ఊహించొచ్చు. అలాంటి మూవీ అందులో రణ్ బీర్ కపూర్ కి సౌత్ లో సీన్ లేకున్నా, సందీప్ రెడ్డి మేకింగ్ కి తోడు రష్మిక హీరోయిన్ అవటంతో క్రేజ్ పెరిగింది. కేవలం సౌత్ నుంచే ఈసినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ పేరుతో 120 కోట్ల బిజినెస్ అయ్యింది.